ఈనెల 15న తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది.

ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా, మరోవైపు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.


