Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
మూడు రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపిల రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డ నేపథ్యంలో తిరిగి ఎన్నిల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపిలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 24వ తేదీన మూడు

పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ సిఫారసు మేరకు ఇప్పటికే

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న కీలక నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను కర్కార్‌డూమా కోర్టు తిరస్కరించింది. నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత బెయిల్ తిరస్కరణకు గురికావడం ఇది రెండోసారి. ఇంతకుముందు గత జనవరి 5న ఇద్దరి బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని

కేంద్రం మరో కీలక నిర్ణయం

ఒకపక్క దేశంలో ఈ20 పెట్రోల్‌పై చర్చ జరుగుతుండగానే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించాలని, ఆధునిక స్వచ్ఛమైన చమురును వాడాలనే కేంద్ర లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు.

ప్రధాని మోడీతో సనాయ్ తకైచి భేటీ

ఇండియా-జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఈ మేరకు రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల (దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని సనాయె తకాచి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అక్కడి హైదరాబాద్ భవన్‌లో మోదీ,

ఇస్రోకు బాంబు బెదిరింపు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బెంగళూరు లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వ‌చ్చిన‌ట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్తమైన ఇస్రో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్‌తో హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న పోలీసులు ఇస్రో ప్రాంగణంలో సిబ్బందిని ఖాళీ చేయించి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ఇది నకిలీ

అమెరికాలో విషాదం .. గుజరాత్ దంపతులు, కుమార్తె

అమెరికాలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు గుజరాత్‌లోని ఖేడా జిల్లా నాడియాడ్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. ఒహియోలోని ఎకానో లాడ్జ్ లో హితేష్‌భాయ్‌ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది.

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరణ

భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ నియామకయ్యారు. ఆయన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన 1.3 మిలియన్ల భారత ఆర్మీకి నాయకత్వం వహిస్తారు. మహారాష్ట్ర, పూనేలోని ఖడక్‌వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన జనరల్ ధీరజ్

భారత పర్యటనకు జపాన్ ప్రధాని సనాయే తకైచి

జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇండియాలో పర్యటించనున్నారు. ఆమె జూలై 1 నుంచి 3 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార, సాంకేతిక సంబంధాల పురోగతి కోసం చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 2022 మార్చిలో జరిగిన ఇండియా-జపాన్ సదస్సు తర్వాత జపాన్ ప్రధాని ఇండియా రాబోతుండటం ఇదే తొలిసారి. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన

లాంఛ‌నంగా అమ‌ర్‌నాథ్ యాత్ర షురూ

ప్రతిష్ఠాత్మక శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర-2026 లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని, యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా ఆయన మంచులింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన సంతోషాన్ని పంచుకున్నారు.హర హర మహాదేవ్! శ్రీ అమర్‌నాథ్ జీ పవిత్ర గుహలో

అయోధ్య బార్ అసోసియేష‌న్ కీల‌క‌ నిర్ణ‌యం .. వారికి 5 ల‌క్ష‌ల ఫైన్‌

అయోధ్య రామాల‌యంలో విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే అయోధ్య బార్ అసోసియేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నిందితుల త‌ర‌పున కేసును వాదించ‌బోమ‌ని లాయ‌ర్ల సంఘం తీర్మానించింది. బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ కాలికా ప్ర‌సాద్ మిశ్రా మాట్లాడుతూ నిధుల చోరీ కేసులో నిందితుల‌ను తర‌పున ఎవ‌రూ వాదించ‌రు అని, ఒక‌వేళ వాదిస్తే వారికి 5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు చెప్పారు. బార్

ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు : మొజ్తాబా ఖమేని

ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన

అన్నాడీఎంకేకు మరో షాక్‌

తమిళనాడులోని అన్నాడీఎంకేకు మరో షాక్‌ ఎదురైంది. ఆరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కరూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విజయభాస్కర్‌, అధికార టీవీకేలో

జీవితం.. వంద మీటర్ల పరుగు పందెం కాదు : నితిన్ నబీన్

రాజకీయాల్లోకి వచ్చాక తన భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డానని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వీబీఐటీ క్యాంపస్ లో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లెవ్‌లో నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నవయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఏ పని చేసినా తనదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నానని, జీవితం వందమీటర్ల పరుగుపందెం కాదని, మన ఓపికకు పరీక్షని

కేతన్ హత్యోదంతంలో మరో షాకింగ్ విషయం!

మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణలో సియా గోయల్ ఆసక్తికర విషయాలు చెబుతోంది. సియాకు కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. ఈ విషయం కేతన్ ఇంట్లో వాళ్లకు లేదా తన ఇంట్లో వాళ్లకు చెప్పినా సరిపోయేది. కానీ, దీని

భార‌త్‌ ప‌ర్య‌ట‌న‌కు డోనాల్డ్ ట్రంప్

భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆ దేశ దౌత్య‌వేత్త సెర్గియో గోర్ తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. కానీ ఎప్పుడు ఆ ప‌ర్య‌ట‌న ఉంటుందో క‌చ్చిత‌మైన తేదీలు త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇండియాలో ప‌ర్య‌ట‌న చేప‌ట్టేందుకు ఉత్సుక‌త‌తో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌ను క‌లిశాన‌ని, ఇండియాకు ఎప్పుడు వెళ్దామ‌ని ఆయ‌న అడిగార‌న్నారు.

స్టాలిన్‌కు మరో షాక్‌

తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు మరో షాక్‌ ఎదురైంది. ఆయన నేతృత్వంలోని డీఎంకేతో 9 ఏళ్లుగా కలిసి ఉన్న ఎండీఎంకే ఆ కూటమి నుంచి వైదొలగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించడంతో పాటు ఎన్నికల హామీల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని ఒక తీర్మానంలో కోరింది. అవినీతి రహిత పాలన అందించాలని, మెకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి

రామ మందిర నిధుల దుర్వినియోగం.. కేసులో కీలక పరిణామం

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇద్దరూ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విరాళాల లెక్కింపులో, నగదు నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న

సిందూర్ లో అమరులైంది వీరే .. కేంద్రం

పాకిస్థాన్‌లో ఉగ్ర‌మూక‌ల్ని అంతం చేసేందుకు భార‌త సైన్యం గ‌త ఏడాది మే నెల‌లో ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌లో ఆరుగురు భార‌తీయ సైనిక సిబ్బంది మృతిచెందిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఆ ఆప‌రేష‌న్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన ఆ సైనికులు పేర్ల‌ను కూడా వెల్ల‌డించారు. దేశ రాజ‌ధానిలో ఉన్న జాతీయ యుద్ధ స్మార‌కంపై ఆ ఆరుగురు సైనికుల పేర్ల‌ను చేర్చ‌నున్న‌ట్లు సైన్యం తెలిపింది.

వెనిజులాలో భూకంపం.. 589కి చేరిన మృతుల సంఖ్య

వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వెనిజులాను తీవ్రంగా కుదిపేశాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు సుమారు 589 మంది మృతి చెందగా, 4,300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ప్రజలు, సహాయక బృందాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. బుధవారం సాయంత్రం సంభవించిన 7.2, 7.5 తీవ్రతల భూకంపాలు వెనిజులాలో గత వందేళ్లలో

కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన .. సీబీఎస్‌ఈ విద్యార్థులకు

సీబీఎస్‌ఈ విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి. అయితే, ఈ విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 7-9 తరగతి విద్యార్థులు పదో తరగతి వరకు తమకు నచ్చిన విదేశీ భాషను చదువుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే అభ్యసిస్తున్న విదేశీ భాషలను రెండు సబ్జెక్టులుగా కొనసాగించవచ్చు. గతంలో అమలైన

భారత పౌరులకు కేంద్రం షాక్ … జూలై 1 నుంచి అమలు

భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్‌పోర్ట్‌ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్‌పోర్ట్‌ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలుకాబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం వెల్లడించింది. కొత్త ఫీజుల వివరాలతో పాస్‌పోర్ట్స్ (అమెండ్‌మెంట్‌) రూల్స్, 2026 పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక,

అది పౌరసత్వానికి రుజువు కాదు : కేంద్రం క్లారిటీ

భారత పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని, అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. 14వ పాస్‌పోర్టు సేవాదినం నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్‌పోర్టు జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వెల్లడించింది. నిజానికి ఆధార్‌ గానీ, ఓటర్‌ ఐడీ కార్డుగానీ కేవలం

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు

ప్రధాని నరేంద్రమోడీతో అమెజాన్‌ కంపెనీ ‌సీఇఓ ఆండీ జెస్సీ ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్‌‌లో అమెజాన్‌ ‌పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో దేశంలో 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ మోడీతో సమావేశం అనంతరం ఆ కంపెనీ ప్రకటించింది. ఈ సమావేశం అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ దశాబ్దం క్రితం భారత్‌లోకి అడుగుపెట్టామ‌ని, అప్పటి నుంచి ఈ-కామర్స్,

రెండేళ్ల తర్వాత .. ఆ దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం

ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నా యి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సేవలు ప్రారంభమవుతుండటం విశేషం. ఈ విషయాన్ని బంగ్లాలో భారత రాయబారి దినేష్ త్రివేది

యాపిల్‌ యూజర్స్‌ కు షాక్‌

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. భారత్‌ లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా లక్ష రూపాయల వరకు ధర పెరగడం గమనార్హం. సవరించిన ఈ కొత్త ధరలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ కోసం పెరుగుతున్న డిమాండ్‌తో మెమొరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు అమాంతం పెరిగాయి.ఈ

అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దు .. భారత పౌరులకు ఎంబసీ సూచన

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నప్ప టికీ, అత్యవసర అవసరం లేకపోతే ఆ దేశానికి ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ,అక్కడ నివసిస్తున్న భారతీయులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని పేర్కొంది. స్థానిక పరిస్థితులపై

గొప్ప మనసు చాటుకున్న సిఎం విజయ్

తమిళనాడు సిఎం విజయ్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఈ రోజు విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి సిఎం పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ఓ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటిప్పటికీ తాను కూడా ఓ మనిషేనని ఆయన నిరూపించుకున్నారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక ప్రతం తీసుకొనేందుకు ఓ గర్భిణీ స్త్రీ

ప్ర‌ధాని మోదీకి ఆహ్వానించిన ఇరాన్ ప్రెసిడెంట్‌

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీని ఇరాన్‌ ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్వయంగా లేఖ రాశారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌ ఇప్పటివరకు ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల విషయంలో శాంతి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలని తన వైఖరిని చెబుతూ వ‌స్తోంది.ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4న ప్రారంభం కానున్నాయి.

నీరవ్‌ మోదీకి ఎదురుదెబ్బ

భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన కేసులో నీరవ్ మోదీ తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ 10.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) కంటే ఎక్కవ చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్ట్ జడ్జి జస్టిస్ సైమన్ టింక్లర్ జూన్ 23

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు.ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్‌, 7 పద్మభూషణ్‌, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను

ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపోదు : సీఎం విజయ్

తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా సూత్రం, నీట్‌ వివాదం, కరూర్‌ తొక్కిసలాట ఘటన తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రసంగం ద్వారా విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తుచేసుకున్నారు. తమకు ఈ అధికారం అంత సులువుగా వచ్చింది కాదని, తమిళనాడు

చరిత్ర సృష్టించిన కృత్రిమ మేథ

న్యాయరంగంలో కృత్రిమ మేథ కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన గార్‌ఫీల్డ్ ఏఐ అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ, న్యాయవాదులతో పోటీపడి కోర్టు కేసులో విజయం సాధించింది. ప్రపంచంలో ఏఐ ఆధారిత న్యాయసంస్థ నేరుగా గెలిచిన తొలి కేసుగా దీనిని భావిస్తున్నారు. ఫ్రీలాన్స్ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్ టామిరెస్ కమల్ టాక్విడిర్‌కు ఒక హాస్పిటాలిటీ సంస్థ చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టింది. దాంతో గార్‌ఫీల్డ్ ఏఐ సంస్థను ఆశ్రయించి ఆ సంస్థ సేవలను

కేంద్ర మంత్రి జార్జ్ కురియ‌న్ రాజీనామా

కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జార్జ్ కురియ‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసిపోవ‌డంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. అయితే మ‌ళ్లీ రాజ్య‌స‌భ సీటు ఇచ్చేందుకు బీజేపీ పార్టీ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌విని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. కురియ‌న్ అంద‌జేసిన రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ముర్ము ఆమోదించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పేర్కొన్న‌ది. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు కూడా

తృణమూల్‌లో భారీ తిరుగుబాటు..   మమతకు ఊహించని షాక్‌

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరసగా షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో మొదలు, రెబెల్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న మమత ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలి పదవిని కోల్పోయింది. రెబెల్ ఎమ్మెల్యే వర్గం ఆమెను టీఎంసీ అధినేత్రిగా తొలగించింది. మమత స్థానంలో టీఎంసీ నాయకుడిగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఎంపికయ్యాడు. అంతేకాదు పలువురు సన్నిహితులు సైతం మమతకు దూరమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్‌పై మమతా

కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి : హైకోర్టు

ఫేస్‌బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్, పోక్సో కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు, తన భర్తకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ రిట్ పిటిషన్‌పై తుది నిర్ణయం వచ్చేంత వరకు సదరు యువతికి పూర్తి

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ర‌సాభాస … ఇజ్రాయెల్ రాయబారి, ఐరాస ప్రతినిధి మధ్య

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ర‌సాభాస నెల‌కొన్న‌ది. ఇజ్రాయిల్ ప్ర‌తినిధి డాన్నీ డాన్‌, ఐక్య‌రాజ్య‌స‌మితి అధికారి వ‌న్నెసా ఫ్రేజ‌ర్ మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. యుద్ధ క్షేత్రాల్లో పిల్ల‌ల‌పై లైంగిక హింస అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇజ్రాయెల్ ప్ర‌తినిధి, యూఎన్ అధికారి మ‌ధ్య తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం సాగింది. ఇద్ద‌రూ గ‌ట్టిగా అరుచుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. యుద్ధ క్షేత్రాల్లో లైంగిక హింస నిర్మూల‌న అంత‌ర్జాతీయ

డొనాల్డ్ ట్రంప్ తంటాలకు నెతన్యాహు గండి.. లెబనాన్‌పై మరోసారి

పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా సిద్ధమవుతుంటే, ఈ ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండికొడుతోంది. లెబనాన్‌పై వరుసగా దాడులు చేస్తోంది. శనివారం కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దక్షిణ లెబనాన్‌పై ఈ రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే, ఇజ్రాయెల్‌ దాడికి దిగడం విశేషం. దక్షిణ లెబనాన్‌లోని నబాతే జిల్లాలోని

డీఎంకేకు ఐయూఎంఎల్ గుడ్ బై.. తెగిన 60 ఏళ్ల బంధం

తమిళనాడులో ప్రతిపక్షమైన డీఎంకేకు మిత్రపక్షాలు వరుసగా షాక్‌ ఇస్తున్నాయి. తాజాగా ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే భారీ విజయం సాధించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించింది. దీంతో పలు పార్టీలు తమ వ్యూహాలను, పొత్తులను

తమిళనాడు సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్షపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్‌లో పేర్కొన్నవి అస్పష్టమైన ఆరోపణలు మాత్రమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. మే 13న అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన తన సంఖ్యాబలాన్ని సీఎం విజయ్

భారత్‌కు అమెరికా షాక్

అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి అంటూ పదేపదే ప్రకటించే అమెరికా, జీ7 సమావేశాల వేళ గట్టి షాక్‌ ఇచ్చింది. యూఎస్‌ ఇండో పసిఫిక్‌ కమాండ్‌ తన అసలు పేరు యూఎస్‌ పపిఫిక్‌ కమాండ్‌కు అధికారికంగా తిరిగి మారుతుందని అమెరికా యుద్ధ శాఖ ప్రకటించింది. తద్వారా ఏడు దశాబ్దాలకు పైగా ఈ సైనిక విభాగం పనిచేసిన ఆ పాత పేరును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన కార్యకలాపాల పరిధికి

ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్

ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు ఎంపీ సీట్లు పోటీ జరగగా, ఒక స్థానం నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపొందారు. మరో సీటును జేఎంఎం సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వైద్యనాథ్ రామ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి ప్రణవ్ ఝా పరిమళ్ చేతిలో

మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రెబల్ నేత రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఎలాంటి మార్పునకు ఆదేశించలేమని కోర్టు తెలిపింది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ క్రిష్ణా రావ్ ఈ కేసుపై నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా

ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. త్వరలోనే

ఈపీఎఫ్‌వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్‌డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలోపు ఈపీఎఫ్‌ అమౌంట్‌ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని

కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం … టెలిగ్రాం యాప్‌ను

కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో టెలిగ్రాం యాప్‌ను ఇండియా బ్లాక్‌ చేసింది. జూన్ 22వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్ అందుబాటులో ఉండ‌దు. జూన్ 21వ తేదీన దేశ‌వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక జూన్ 30వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను కూడా ప్ర‌భుత్వం డిజైబుల్ చేసింది. ఎగ్జామ్ మెటీరియ‌ల్‌ను లీకేజీ చేయ‌కుండా ఉండేందుకు

తమిళనాడు సీఎం విజయ్ .. గుడ్ న్యూస్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణ మాఫీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగు చేస్తున్న వారికి గొప్ప ఉపశమనం లభించింది. సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలను ప్రభుత్వం రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా దొరికింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు 75,000 రూపాయల వరకు ఉన్న పంట

వారు వెళ్లిపోవచ్చు … ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏడుగురు ఎంపీలు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోపు వారంతా షిండే వర్గంలో చేరే అవకాశం ఉందని శివసేనకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే క్రిపాలు మానె వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ ఎంపీల విధేయతపై వస్తున్న

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం : స్వాగతించిన మోదీ

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడమే కాకుండా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా పశ్చిమాసియాలో కొనసాగిన ఘర్షణల వల్ల అనేక దేశాల్లో ప్రాణనష్టం సంభవించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను

యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డు

ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ యూట్యూబర్‌ గా పేరొందిన మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డు‌ సృష్టించారు. యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్‌స్క్రైబర్లు దాటిన తొలి క్రియేటర్‌గా నిలిచాడు. 2026 జూన్ 12న మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌ లైవ్‌లో ఉన్న సమయంలో 50 కోట్ల సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్‌ చరిత్రలో ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు. కాగా మిస్టర్‌ బీస్ట్‌ ఫిబ్రవరి 2012లో తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు.

ఆ దాడులు సమంజసం కాదు : భారత్‌

ఒమన్‌ తీరంలో ఇటీవల భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని భారత్‌ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. రూబియోతో మాట్లాడినట్లు జై శంకర్‌ పేర్కొన్నారు. గల్ఫ్‌లో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు

భారత ఆర్మీ నూతన చీఫ్‌గా ధీరజ్‌ సేత్

భారత సైన్యం లో అత్యున్నత పదవి అయిన ఆర్మీ చీఫ్‌ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 2026 జూన్ 30 నుంచి ధీరజ్ సేథ్ భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన పదవీకాలం ఆగస్టు 31

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్‌ను రద్దుచేసిన ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్.. ఒకసారి నామినేషన్‌ను తిరస్కరించాక, ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ

పెద్ది సినిమా హిట్ అయినా జాన్వీకి మైనస్

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటన, ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమా విజయంతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు … వారికి నెలకు రూ.30,000 చెల్లించాల్సిందే

దేశంలో గృహిణుల శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణించినా, వైకల్యం సంభవించినా నెలకు కనీస పరిహారం కింద ఈ మొత్తం చెల్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సంజయ్ కరోల్, కే కోటిశ్వర్ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. మమతపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ చెప్తున్నారు. తాజాగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్‌బరైక్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో టీఎంసీకి మరో ఎదురుదెబ్బ తగిలనట్లయింది.ఇటీవలే రాజ్యసభ సభకు సుఖేందు

టీఎంసీ విలీనం .. కాంగ్రెస్‌ ఏమన్నదంటే|

కాంగ్రెస్‌లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ కథనాలను కాంగ్రెస్‌ ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు వెల్లడించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, భాజపా మద్దతు ఉన్న అభ్యర్థిని అంగీకరించడం ప్రజాస్వామ్యం దుస్థితిని చాటుతోందన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా,

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు.. బిగ్ షాక్

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా, అది తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఒక

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికిముందే శారీరక సంబంధం పెట్టుకుంటే వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టంచేసింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లికి ముందు ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడనే కారణంతో తెలంగాణ ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని రద్దుచేసింది. తనను

సీఎం విజ‌య్‌కు చెక్ పెట్టిన ప్ర‌జ్ఞానంద‌

నార్వే చెస్ టైటిల్ గెలిచిన గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద‌ అదే ఊపులో ఉన్నారు. త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌ని కూడా ప్ర‌జ్ఞానంద ఓ గేమ్‌ లో ఓడించారు. నార్వే టైటిల్ గెలిచిన సంద‌ర్భంగా సీఎం విజ‌య్‌ని ఆ రాష్ట్ర సెక్ర‌టేరియేట్‌లో ప్ర‌జ్ఞానంద క‌లిశారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ కాసేపు స‌ర‌దాగా చెస్ ఆడారు. అయితే కేవ‌లం కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజ‌య్‌కు గ్రాండ్‌మాస్ట‌ర్ చెక్ పెట్టేశారు. చెస్ స్టార్ ప్ర‌జ్ఞానంద‌కు 50

మ‌మ‌తా బెన‌ర్జీకి షాక్..ఎన్డీఏలో చేర‌నున్న ఎంపీలు!

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మాజీ సిఎం, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీకి షాకిస్తూ, సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పార్టీ నాయకుల్లో అసమ్మతి సెగలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. తాజాగా టిఎంసికి చెందిన 20మంది ఎంపీలు మమతకు వ్యతిరేకంగా సపరేట్ వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం : పీయూష్‌ గోయెల్‌

సుదీర్ఘకాలంగా చర్చల దశలో ఉన్న భారత్‌-అమెరికా ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుంది. వచ్చే జూలైలో ఈ ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో పన్నుల విషయంలో ఇరుదేశాల మధ్య స్వల్ప వివాదం తలెత్తినప్పటికీ చర్చలు మాత్రం వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుంటూ, పరస్పర

ఆ సునామీ 2013 లోనే వచ్చింది

దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టి బతుకవద్దని రాహుల్‌కు చురకలు వేసింది. ఆర్థిక సునామీ 2013 లోనే వచ్చిందని, ఇప్పుడు కాదని బీజేపీ నేత

ఇండోనేషియా ఓపెన్ నుంచి పీవీ సింధు ఔట్‌

ఒలింపిక్ మెడ‌లిస్ట్ పీవీ సింధు ఇండోనేషియన్ ఓపెన్‌లో ఓట‌మి పాలైంది. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ ఆన్ సే యంగ్ చేతిలో ఆమ ప‌రాజ‌యాన్ని చూవిచూసింది. 17-21, 14-21 స్కోరుతో ద‌క్షిణ కొరియా క్రీడాకారిణి విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఇటీవ‌ల వ‌రుస‌గా రెండోసారి ఆన్ సే యంగ్ చేతిలో పీవీ సింధు ఓడింది. గ‌త వారం సింగ‌పూర్ ఓపెన్ క్వార్ట‌ర్స్‌లోనూ సింధు ఓట‌మి పాలైన‌ విష‌యం తెలిసిందే. అయితే

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. బెంగళూరు లోని లోక్ భవన్‌లో ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్

మమతా బెనర్జీకి షాక్ …అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా

పశ్చిమబెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా సిబ్బంది రితబ్రతకు ఇచ్చేశారు. అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ను తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో పార్టీలో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ మొత్తం

సీఎం విజ‌య్‌ను ఆహ్వానించిన ఖుష్బూ సుందర్ దంపతులు

తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లిన ఖుష్బూ దంపతులు, తమ కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి

ఆ రికార్డును బ్రేక్ చేసిన.. ప్రధాని మోదీ

నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ నెల 10న ఇండియాకు అత్యధిక కాలం పని చేసిన ప్రధానిగా నిలవబోతున్నారు. అది కూడా ఎన్నికల్లో గెలిచి, అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన జవహర్ లాల్ నెహ్రూను దాటేయబోతున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మే 13, 1952న పదవీ బాధ్యతలు చేపట్టారు. మే 27, 1964న ఆయన మరణించేవరకు ప్రధానిగానే ఉన్నారు. అలా మొత్తం 4,398 రోజులు

బీజేపీకి అన్నామలై రాజీనామా

తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను అన్నామ‌లైకి చేదు

తాజ్‌మహల్ ను సందర్శించిన డొనాల్డ్ ట్రంప్ కూతురు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ శనివారం తన భర్త మైకేల్ బౌలోస్‌తో కలిసి ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించారు. దాదాపు గంటసేపు ఆ కట్టడంలో గడిపి అనేక విశేషాలు తెలుసుకున్నారు. తన భర్త బౌలోస్‌తోపాటు కొంతమంది సన్నిహిత స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 11 గంటలకు ఆమె తాజ్‌మహల్‌కు విచ్చేశారు. తాజ్‌మహల్ లోని అనేక ప్రదేశాలను ఫోటోలు తీసుకున్నారు. తాజ్‌మహల్ చరిత్ర, నిర్మాణం గురించి ఆమె ఎక్కువ ఆసక్తి

కర్ణాటక ముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌ ..3న ప్రమాణస్వీకారం

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌ పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ ‌శాసనసభాపక్ష (సిఎల్‌‌పి) నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన్‌‌సౌధలో జరిగిన సిఎల్‌‌పి సమావేశంలో శివకుమార్‌ ‌పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. పది నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం విశేషం. సమావేశం అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్‌‌తో కలిసి అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ (ఎఐసిసి) ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ‌మాట్లాడారు. శాసనసభలో కాంగ్రెస్ సభాపక్ష

ఆరుగురు పిల్లలుంటే ఓటు హక్కు కట్‌!

ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించ వచ్చా? అంటే తొలగించవచ్చుననే అంటున్నారు యూపీలోని ఎన్నికల అధికారులు. మీకు ఆరుగురు పిల్లలున్నారా అంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 6న వారణాసి కంటోన్మెంట్‌ పరిధిలోని సోనుగిరీ (35)కి నోటీస్‌ పంపింది. అతను అవునని సమాధానం ఇవ్వడంతో తుది జాబితాలో అతని పేరును తొలగించారు. ఇలాంటి కారణంతో నియోజకవర్గంలోని 20 బూత్‌ల పరిధిలో వేలాది

హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం .. మూడు నెలల్లో

కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్‌దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని హైకోర్టులు విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తీర్పు వెల్లడించాలని ఆదేశించింది. రిజర్వ్ చేసిన తేదీ నుంచి

సిద్ద‌రామ‌య్య రాజీనామాను ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్

క‌ర్నాట‌క సీఎం  సిద్ధ‌రామ‌య్య స‌మ‌ర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ అంగీక‌రించారు. గురువారం రోజున లోక్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి కి సిద్ద‌రామ‌య్య త‌న రాజీనామాను అంద‌జేశారు. రాజ్యాంగం లోని ఆర్టిక‌ల్ 164(1) ప్ర‌కారం త‌న‌కున్న అధికారాల అనుసారం సీఎం సిద్ద‌రామయ్య స‌మ‌ర్పించిన రాజీనామాను స్వీక‌రిస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ తెలిపారు. సిద్ద‌రామ‌య్య నేతృత్వంలో ఉన్న మంత్రిమండ‌లిని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ త‌న నోటిఫికేష‌న్‌లో తెలిపారు. అయితే

వినేశ్‌ ఫొగాట్‌కు సుప్రీం కోర్టులో ఊరట

భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌ లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ ఫోగాట్‌కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపి, వినేష్ ఫోగాట్‌కు

కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని

కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. అలాగే, తన ఖర్చుల కోసం అక్కడ పని చేస్తోంది కూడా. త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా

కర్ణాటకలో కీలక పరిణామం .. సీఎం ప‌ద‌వికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం

బీజేపీ కీలక నిర్ణయం .. నాలుగు రాష్ట్రాలకు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్, హరియాణా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వివరాలు వెల్లడించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించింది. పంజాబ్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్‌ పేరును ప్రకటించింది. హరియాణా అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా

భారత్‌కు జపాన్ షాక్ .. 20 ఏళ్ల తర్వాత మళ్లీ నిషేధం!

భారత మామిడి ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సీజన్‌కుగాను భారత మామిడి పండ్ల దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌ లోని క్రిమిసంహారక కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని జపాన్ తనిఖీ బృందం గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో మామిడి ఎగుమతిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌ లోని రెహ్మాన్‌పూర్‌లో ఉన్న ఒక ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు

ప్రధాని మోదీతో భేటీ సీఎం విజయ్

తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్‌ భేటీ అయ్యారు. గతంలో 12 ఏళ్లక్రితం మోదీని విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ, ఈసారి విజయ్ సీఎం హోదాలో ప్రధానిని కలవడం విశేషం. మోదీ, విజయ్ ఈరోజు దాదాపు 25 నిమిషాలపాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం విజయ్, న్యూఢిల్లీలోని తమిళనాడు

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్ కు … భారత్‌ వార్నింగ్‌

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్ ‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. చైనా  అధ్యక్షతన జరిగిన యూఎన్‌ఎస్‌సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని

మమతాబెనర్జికి మరో షాక్‌

పశ్చిమబెంగాల్‌ లో ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి కి బరాసత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ షాకిచ్చారు. ఆమె టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే ఆమె టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. దస్తిదార్, బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు. 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను

ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత.. క్యాబినెట్‌ లోకి కాంగ్రెస్‌

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది. గురువారం ఏర్పడనున్న క్యాబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు

సీఎం విజయ్ సంచలన నిర్ణయం … వారిని పట్టిస్తే రూ.లక్ష బహుమతి

తమిళనాడులోని ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని నిర్మూలించేందుకు టీవీకే అధినేత, సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు లంచం తీసుకున్నట్లు గుర్తించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. రూ. వెయ్యి లంచం తీసుకున్న వారిపై ఫిర్యాదు చేసినా ఈ బహుమతి ఇస్తామని తెలిపారు. సీఎం విజయ్ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలో చర్చ మొదలైంది.

విజయ్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు : స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు లేక అస్థిరంగా ఉందని, ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చు అని, డీఎంకే

ఫాల్టా ఉప ఎన్నికలో .. మమతా బెనర్జీకి షాక్

పశ్చిమ బెంగాల్‌లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యం లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నిక జరగడానికి రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇది టీఎంసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న ఉప

భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్, భారత పర్యట షెడ్యూల్ ను క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ తెలిపారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చెప్పారు. మరింత సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, బ్రిక్స్ నాయకులు గత ఏడాది

చరిత్రలో ఉంటారో లేదో .. వాళ్లే డిసైడ్ చేసుకోవాలి : ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ 

పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. మానేక్‌షా సెంట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ఒవ‌కేళ పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను పోషించి, వాళ్ల‌ను ఇండియా మీద‌కు ఉసి గొల్పుతే, అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశాన్ని వాళ్లే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. చ‌రిత్ర‌లో ఆ దేశానికి స్థానం ఉండాలంటే ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషించ‌రాద‌న్నారు. ఒక‌వేళ ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్ట‌డానికి

సీబీఎస్ఈ కీలక నిర్ణయం .. జులై 1 నుంచి ఇది అమలులోకి

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో లాంగ్వేజ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2026 జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని  తప్పనిసరి చేస్తూ సీబీఎస్‌ఈ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి 2020), నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఎన్ సిఎఫ్-ఎస్ఈ 2023) సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం

తమిళనాడు మంత్రులకు శాఖలు కేటాయింపు .. సీఎం విజయ్‌ వద్దే

తమిళనాడులో  కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్‌ తన వద్దే ఉంచుకున్నారు. ప్రజా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, ప్రత్యేక కార్యక్రమాల అమలు, యువజన, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, పురపాలక పరిపాలన, పట్టణ, నీటి సరఫరా శాఖల బాధ్యతలు కూడా ఆయన నిర్వహించనున్నారు. సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. విజయ్‌

నా వ్యాఖ్యలను వక్రీకరించారు  : సీజేఐ సూర్యకాంత్‌

కొందరిని తాను పరాన్నజీవులుగా లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్‌లు, బోగస్ డిగ్రీలతో మీడియాలోకి, న్యాయవ్యవస్థలోకి, ఇతర వృత్తుల్లోకి ప్రవేశించేవారిని ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా తోపాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నానని చెప్పారు.

పశ్చిమబెంగాల్  సీఎం సువేందు అధికారి .. కీలక నిర్ణయం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలో గెలిచిన ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. గెలిచిన మరో నియోజకవర్గం భవానీపూర్‌ను తనవద్దే ఉంచుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గానికి చేసిన రాజీనామాను స్పీకర్ రతీంద్ర బోస్‌కు సువేందు అందజేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎవరైనా రెండు నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ ఒక నియోజకవర్గాన్ని14 రోజుల లోపు వదులుకోవాల్సి ఉంటుంది. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని

సిటీ సివిల్  కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్ పోక్సో కేసుతో పాటు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను

మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

వివాదాస్పద భోజ్‌శాల విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ భోజ్‌శాలను దేవాలయంగా ప్రకటించింది. వివాదాస్పద స్థలం ఆలయానిదేనంటూ ఇండోర్‌ ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఆలయంలో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భోజ్‌శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్‌లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో పాకిస్థాన్‌కు ఊహించని

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో  అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎస్‌డీగా రాధన్ పండిట్ నియామకాన్ని టీవీకే కూటమిలోని పార్టీ నేతలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రాధన్ పండిట్ తమిళనాడులో అత్యంత

బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన సీఎం విజ‌య్ ప్రభుత్వం

త‌మిళ‌నాడు అసెంబ్లీలో  సీఎం విజ‌య్ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఆయ‌న‌కు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్య‌తిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబ‌ల్స్, టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. కానీ ప‌ళ‌నిస్వామి వ‌ర్గం మాత్రం వ్య‌తిరేకంగా ఓటేసింది. టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 108 స్థానాల్లో నెగ్గింది.  విజ‌య్

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం 2022లో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ అమలుపై నూతన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా విద్యాసంస్థల్లో ఇటు

నందిగ్రామ్‌ స్థానాన్ని వదులుకున్న బెంగాల్‌ సీఎం

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, భవానీపూర్ సీటును నిలుపుకున్నారు. నందిగ్రామ్‌ స్థానాన్ని వదులుకున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో భవానీపూర్‌ ఎమ్మెల్యేగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్ సీటును వదులుకున్నట్లు చెప్పారు. నందిగ్రామ్‌ నుంచి (ఉప ఎన్నిక ద్వారా) మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. అయితే రాబోయే ఐదేళ్లలో అక్కడి ప్రజలు నా లేమిని ఏమాత్రం అనుభవించనివ్వను. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో

అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌మాణ స్వీకారం

అస్సాం ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌మాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం వ‌రుస‌గా ఇది రెండోసారి. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌సాద్ ఆచార్య ఆయ‌న చేత‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అస్సాంలో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజ‌ర‌య్యారు. బీజేపీ నేత రామేశ్వ‌ర్ తేలి మంత్రిగా ప్ర‌మాణం

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.