ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ సిఫారసు మేరకు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు తెలిపారు.దేశానికి సంబంధించిన అంశాలపై సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కిరణ్ రిజిజు అన్నారు.

































