Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విచ్చేసి సాదర స్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి అధ్యక్షుడు స్వయంగా రావడం ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి అద్దం పడుతోంది.అంతకుముందు, ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక

నీతా అంబానీకి అమెరికాలో .. అరుదైన గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఫ్లోరిడా లోని టాంపా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) వారి నుంచి నీతా అంబానీ హ్యూమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ప్రధానంగా ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వ్యక్తులను గౌరవించడానికి ఇస్తారు. నీతా అంబానీ

తానా ఛార్లెట్ నాయకుల దాతృత్వం..పైన్‌విల్ చర్చికి నిత్యావసరాల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కమ్యూనిటీతోపాటు, అమెరికా కమ్యూనిటీకి కూడా తానా నాయకులు సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఛార్లెట్ లోని తానా నాయకులు పైన్‌విల్‌లోని చర్చికి ఫుడ్ డొనేషన్ చేశారు. తానా నాయకులు అంతా కలిసికట్టుగా 75 బ్యాగుల నిత్యావసర సరుకులను, 400 ఫుడ్ కాన్స్‌‌ను విరాళంగా సేకరించి అందించారు. ఈ సందర్భంగా

అమెరికాలో విషాదం .. గుజరాత్ దంపతులు, కుమార్తె

అమెరికాలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు గుజరాత్‌లోని ఖేడా జిల్లా నాడియాడ్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. ఒహియోలోని ఎకానో లాడ్జ్ లో హితేష్‌భాయ్‌ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది.

చైనా బిలియ‌నీర్‌కు జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు

చైనా బిలియ‌నీర్ గువో వెంగుయికి 30 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. అమెరికాలోని మ‌న్‌హ‌ట‌న్ జిల్లా కోర్టు ఆయ‌నకు ఆ శిక్ష‌ను విధించింది. జిల్లా జ‌డ్జీ అనాలిసా టోరిస్ ఆ తీర్పును వెలువ‌రించారు. చైనాలో ఒక‌ప్పుడు సంప‌న్న వ్య‌క్తిగా ఉన్న గువో వెంగుయి, కొన్నేళ్ల క్రితం అమెరికాకు ప‌రారీ అయ్యారు. అయితే అమెరికా వేదిక‌గా చైనా క‌మ్యూనిస్టు పార్టీని ఆయ‌న విమ‌ర్శించేవారు. బిలియ‌న్ డాల‌ర్ల స్కామ్‌లో అమెరికా కోర్టు ఆయ‌న‌కు ఇవాళ‌

తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు కృతజ్ఞతలు

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ సమీపంలో ప్రధాన రహదారికి డోనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ అని నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్‌ స్పందించారు. భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అవెన్యూకు నా పేరు పెట్టారు. ఈ విధంగా గౌరవం పొందిన తొలి అధ్యక్షుడిని నేనే, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని

ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు : మొజ్తాబా ఖమేని

ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన

భార‌త్‌ ప‌ర్య‌ట‌న‌కు డోనాల్డ్ ట్రంప్

భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆ దేశ దౌత్య‌వేత్త సెర్గియో గోర్ తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. కానీ ఎప్పుడు ఆ ప‌ర్య‌ట‌న ఉంటుందో క‌చ్చిత‌మైన తేదీలు త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇండియాలో ప‌ర్య‌ట‌న చేప‌ట్టేందుకు ఉత్సుక‌త‌తో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌ను క‌లిశాన‌ని, ఇండియాకు ఎప్పుడు వెళ్దామ‌ని ఆయ‌న అడిగార‌న్నారు.

తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో నాన్నతో నడక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మరో మధురమైన కార్యక్రమం నాన్నతో నడక. ఫాదర్స్ డేను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం ఈ వేడుకను జూన్ 21న, పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి

లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25) బ్రిటన్‌లో హఠాన్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన శ్రీనాథ్ రెడ్డి, అక్కడ లీసెస్టర్ పట్టణంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం

భారత కాన్సుల్ జనరల్‌కు టీసీఏ ఆహ్వానం

తెలుగు సాంస్కృతిక సమితి (టీసీఏ)కార్యనిర్వహక కమిటీ అధ్యక్షుడు కే యాదగిరి రెడ్డి, చార్లీ చౌదరిలు భారత కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. ఆగస్టు 7, 8 తేదీలలో జరగనున్న టీసీఏ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా అహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, తెలుగు సమాజ ఐక్యత, యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే అంశాలపై చర్చించారు. తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, తెలుగు

అమెరికాలో వైభవంగా మాటా మహాసభలు .. తెలుగు ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వేడుకలు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి. సంస్కృతి, ఆధ్యాత్మికత, వినోదంతో పాటు సామాజిక చైతన్యం, సాంకేతికతను సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 7,500లకు పైగా తెలుగు కుటుంబాలు ఒకే వేదికపైకి రావడం విశేషం.ప్రముఖ సంగీత

అది పౌరసత్వానికి రుజువు కాదు : కేంద్రం క్లారిటీ

భారత పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని, అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. 14వ పాస్‌పోర్టు సేవాదినం నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్‌పోర్టు జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వెల్లడించింది. నిజానికి ఆధార్‌ గానీ, ఓటర్‌ ఐడీ కార్డుగానీ కేవలం

డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు బ్రేకేసిన అమెరికా సేనేట్‌

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ సేనేట్ బ్రేకేసింది. ఇరాన్ యుద్ధం అంశంలో యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానం ఆమోదం పొంద‌డంతో, ట్రంప్ అధికారాల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయ్యింది. ఉభ‌య‌స‌భ‌ల అనుమ‌తి లేకుండా యుద్ధాల అంశంలో ట్రంప్ సైనిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా ఆ తీర్మానం పాస్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఇరాన్‌తో యుద్ధం మొద‌లైన త‌ర్వాత తొలి సారి అమెరికా కాంగ్రెస్ ట్రంప్ వేగానికి క‌ళ్లెం

అమెరికా పౌరసత్వం ఖరీదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్‌ను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం మరింత ఖరీదుగా మారనుంది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75 శాతం మేర పెంచాలని యూఎస్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. సక్రమ మార్గంలో వచ్చిన వలసదారులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే, ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించాల్సిరావడంతోపాటు ఇప్పటివరకు ఉన్న

తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు

అమెరికాలోని వర్జీనియాలో ఫాదర్స్ డే వేడుకలు తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

దీనివల్ల అమెరికా ప్రజలకు మంచి భవిష్యత్తు : జేడీ వాన్స్‌

పశ్చిమాసియా లో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకడమే లక్ష్యంగా ఆ దేశంతో జరిపిన చర్చలు తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని చెప్పారు. దీనివల్ల అమెరికా ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ సోయా, మొక్కజొన్న, గోధుమలను టెహ్రాన్‌ కొనుగోలు చేస్తే దానికి బదులుగా విదేశాల్లో ఉన్న ఇరాన్‌

బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ రాజీనామా

బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ రాజీనామా చేశారు. లేబ‌ర్ పార్టీ నేత‌గా కూడా రిజైన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే త‌మ పార్టీకి కొత్త నేత‌ను ఎంపిక చేసే వ‌ర‌కు తాత్కాలిక‌గా ప్ర‌ధానిగా స్టార్మ‌ర్ కొన‌సాగ‌నున్నారు. మ‌రికొన్ని వారాల్లో కొత్త నేత‌ను ఎన్నుకోనున్నారు. 2024లో ఆయ‌న నేతృత్వంలో లేబ‌ర్ పార్టీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. కానీ రెండేళ్ల‌లోనే ఆయ‌న‌తో పాటు పార్టీ పాపులారిటీ కూడా త‌గ్గిపోయింది. గ‌త వారం జ‌రిగిన

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు. ఉన్నత విద్య కోసం కొంతకాలం కిందట అమెరికాకు వెళ్లిన అరుణ్ ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. టెంపాలో స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)గా ఉన్నాడు. ప్రస్తుతం ఫుల్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 13వ తేదీన అరుణ్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ

డొనాల్డ్ ట్రంప్ తంటాలకు నెతన్యాహు గండి.. లెబనాన్‌పై మరోసారి

పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా సిద్ధమవుతుంటే, ఈ ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండికొడుతోంది. లెబనాన్‌పై వరుసగా దాడులు చేస్తోంది. శనివారం కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దక్షిణ లెబనాన్‌పై ఈ రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే, ఇజ్రాయెల్‌ దాడికి దిగడం విశేషం. దక్షిణ లెబనాన్‌లోని నబాతే జిల్లాలోని

కొత్త విమానాన్ని ఆవిష్క‌రించిన ట్రంప్‌

కొత్త ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానాన్ని ట్రంప్ ఆవిష్క‌రించారు. అమెరికా అధ్య‌క్షులు ప్ర‌యాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ అని పిలిచే విష‌యం తెలిసిందే. అయితే ఖ‌తార్ స‌ర్కారు గిఫ్ట్‌గా ఇచ్చిన బోయింగ్ 747-8ఐ ల‌గ్జ‌రీ విమానాన్ని రీఫ‌ర్‌బిష్ చేశారు. ఎరుపు, తెలుపు, నేవీ బ్లూ లైన్ల‌తో ఆ విమానాన్ని తీర్చిదిద్దారు. కొత్త ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానాన్ని మేరీల్యాండ్‌లో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఆవిష్క‌రించారు. అక్క‌డ ల్యాంగ‌ర్‌ను పార్క్

ఇరాన్ కు లైన్‌ క్లియర్‌ .. ఆంక్షలు ఎత్తివేసిన యూఎస్‌

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలకు లైన్ క్లియర్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల వద్ద విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఇరాన్ షరతులకు అంగీకరించడంతో ఎత్తివేసినట్లు ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు

ఆంథోనీ ఫౌసీ పై .. తుల‌సీ గ‌బ్బార్డ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్ట‌ర్ తుల‌సీ గ‌బ్బార్డ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బైడెన్‌కు మెడిక‌ల్ అడ్వైజ‌ర్‌గా ఉన్న డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ చైనాలోని వుహాన్ వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌కు ఫండింగ్ చేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కోవిడ్‌19 వ్యాప్తికి కార‌ణ‌మైన ఆ ల్యాబ్‌పై స‌మాచారాన్ని దాచి పెట్టే విధంగా ఫౌసీ ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె తెలిపారు. వుహాన్ ల్యాబ్ గురించి అమెరికా కాంగ్రెస్‌ను కూడా ఫౌసీ త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని తుల‌సీ

ఇజ్రాయిల్ పై అమెరికా ఒత్తిడి తేవాలి: నోయల్ బారోట్

లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులను నిలిపివేయాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ -నోయల్ బారోట్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లెబనాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని డిమాండ్ చేసిన అమెరికా-ఇరాన్ ఒప్పంద నిబంధనలకు సవాలు విసిరేలా దక్షిణ లెబనాన్ లోని సైనిక నియంత్రణ ప్రాంతం అవతల కూడా దాడులు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఇజ్రాయిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ సైన్యానికి మద్దతు పెంపొందించేందుకు ఒక అంతర్జాతీయ

యూఎస్-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా

ఓవైపు ఇరాన్, అమెరికా శాంతి చర్చల ఒప్పందంపై ఏకాభిప్రాయంతో యుద్ధానికి స్వస్తి పలుకుతుంటే మరోవైపు ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ అశాంతిని ప్రేరేపిస్తోంది. బేక వ్యాలీలో వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. ఈ దాడుల ప్రభావం యూఎస్-ఇరాన్ శాంతి చర్చల మీద పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ వేదికగా ఎంఓయూ హార్డ్‌ కాపీపై ట్రంప్‌ సంతకం చేయగా, టెహ్రాన్‌లో పెజెష్కియాన్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఫ్రాన్స్‌లోని చారిత్రాత్మక వెర్సైల్స్ ప్యాలెస్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక చారిత్రాత్మక 14-సూత్రాల మధ్యంతర ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేశారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు దేశాల అధినేతలు నేరుగా ఒక ఒప్పందంపై సంతకాలు చేయడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఒప్పందం ప్రపంచ

యూఏఈ కీలక నిర్ణయం.. 15 ఏళ్లు నిండితేనే

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం పిల్లల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన మరికొంత సమగ్రమైన సమాచారం, హెడ్డింగ్స్, స్లగ్, ట్యాగ్స్ మరియు మెటా డిస్క్రిప్షన్ కింద ఇవ్వబడ్డాయి. డిజిటల్ విప్లవంలో భాగంగా మారుతున్న జీవనశైలి పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఒక కీలకమైన చట్టాన్ని తీసుకువచ్చింది. 15 ఏళ్లలోపు

తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం.. వింటర్ హీరోగా

దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్రాండ్ అయిన హాల్స్ సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని వింటర్ హీరోస్ గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. గత 18 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజ సేవలో నిబద్ధతతో పని చేస్తూ నాగరాజు అనేక

ట్రంప్‌తో కొన్నిసార్లు విభేదాలు .. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

మిత్రదేశమైన అమెరికా కంటే ఇజ్రాయెల్ భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు. ఆ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందమని అన్నారు. ఇరాన్- అమెరికా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అనిపిస్తే ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంటామని, ఆ అంశంలో ట్రంప్ తో విభేదాలు వస్తుంటాయని

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక రంగ సహకారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో సహకారం అందించాలని సీఎం

కువైట్‌లో టీడీపీ, జనసేన విజయోత్సవ వేడుకలు

కువైట్‌లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫర్వానియా ద్వైహి ప్యాలెస్ హోటెల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభత్వం గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గల్ఫ్ ఎంపర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు వివరించారు. కూటమి ప్రభుత్వం నమ్మకానికి మారుపేరని, మరో పదిహేను

ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరింది : డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ ఓడరేవుల దిగ్భంధం ఎత్తి వేయాలని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.ఈ సందర్బంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోని నౌకలు.. తమ ఇంజిన్లను స్టార్ట్ చేయండని, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండని సూచించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు ట్రంప్ తెలియజేశారు.

కువైత్‌లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

కువైత్‌లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తి అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి ప్రశంసించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు.

ఛార్లెట్‌లో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఛార్లెట్‌లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఐదు దశాబ్దాలుగా వెండితెరపై రారాజులా వెలుగుతున్న బాలయ్య, నేటికీ అదే జోష్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారని అన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అఖండ చిత్రంతో స్టార్ట్

పాకిస్తాన్ కీలక ప్రకటన .. రెండు దేశాల మధ్య 24 గంటల్లో

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. దీనిపై షెహబాజ్ షరీఫ్‌ కీలక ప్రకటన చేశారు.ఇరాన్, అమెరికా మధ్య అనుకున్నదానికంటే తొందరగానే శాంతి ఒప్పందం

డెన్మార్క్‌లో ఘనంగా మినీ మహానాడు

డెన్మార్క్‌‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుక‌లు ఘ‌నంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మన్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌లు వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్

దుబాయ్ లో ప్రమాదం .. బాధిత కుటుంబాలకు ఎన్నారై ఆర్థిక సాయం

దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రవాస భారతీయుడు, మలయాళీ వ్యాపారవేత్త డాక్టర్‌ షంషీర్‌ వయలీల్‌ అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు మొత్తం రూ.2.50కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్‌ బాట పట్టిన పేద ప్రవాసీ కుటుంబాలకు మానవత దృక్ఫథంతో సాయం చేయడం ఆత్మసంతృప్తి కలిగిస్తోందని డాక్టర్‌ షంషీర్‌ వయలీల్‌ చెప్పారు. దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ ప్రవాసులుసహా మొత్తం ఏడుగురు

న్యూయార్క్‌లో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వం లో తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో హిక్స్‌విల్లేలోని అసామై హిందూ టెంపుల్‌లో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశేష భక్త జన సందోహంతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, ఈవెంట్ కోఆర్డినేటర్ ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి తెలిపారు. సుమారు 500

తానా వేసవి క్రీడాసంబరాలు… పికిల్‌బాల్ టోర్నమెంట్‌ విజయవంతం

వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆటల పోటీలను ప్రారంభించింది. అందులో భాగంగా కన్నపోలిస్‌లోని కరోలినా పికిల్‌బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది. బిగినర్, ఇంటర్మీడియెడ్, అడ్వాన్స్‌డ్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పోటీలు జరిగాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో 65కు పైగా టీంలు ఉత్సాహంగా పాల్గొని తలపడ్డాయి. టోర్నమెంట్‌ను ఇంతటి భారీ స్థాయిలో విజయవంతం చేసిన

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు.. ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

సింగపూర్‌లోని భారత హై కమిషన్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ గా సేవలందించి బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వైఎస్‌వీఎస్ఆర్‌ కృష్ణకి శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనమైన ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. దాదాపు 50 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ కృష్ణ సింగపూర్‌లోని తెలుగు వారందరికి ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో, అందించిన సహాయం, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు

జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, గళ్లా రామచంద్ర రావు పాల్గొన్నారు.ఎన్‌ఆర్‌ఐ-టీడీపీ జర్మనీ విభాగానికి సంబంధించి వెబ్

అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో స‌త్తా చాటిన తెలుగు తేజం

అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో తెలుగ‌మ్మాయి ఇషాన్వి సబ్నివీసు సత్తా చాటింది. అమెరికా జాతీయ ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి ద్వితీయ బహుమతి అందుకుంది. 35 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 3లక్షల మంది విద్యార్థుల్లో తెలుగు తేజం ఇషాన్వి స‌త్తా చాట‌డం విశేషం. దృష్టి లోపం ఉన్నవారి కోసం స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్ విద్యార్థిని ఆవిష్కరించిన ఏఐ-పవర్డ్ స్మార్ట్ కేన్ కు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. ఈ ప్రాజెక్ట్

ఎన్నారై ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్,

డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఇరాన్‌పై అమెరికా యుద్ధం విషయంలో అమెరికా చట్టసభ నుంచి డొనాల్డ్ ట్రంప్‌ దూకుడుకు ఎదురుదెబ్బ తగిలింది. అనవసర వ్యయం, అనుచిత నిర్ణయాలతో సాగుతున్న ఇరాన్‌తో యుద్ధాన్ని నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభ స్పష్టం చేసింది. యుద్ధ అధికారాల తీర్మానం ( వార్ పవర్స్ రిసొల్యూషన్ )కీలక పరిణామంగా నిలిచింది. గురువారం జరిగిన సభలో సంబంధిత తీర్మానానికి అనుకూలంగా 215 మంది ఎంపిలు, వ్యతిరేకంగా 208 మంది ఓటేశారు. ప్రతినిధుల సభలో

డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించిన కోమటి జయరాం

ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగరంలో జయరాం కోమటి పర్యటించారు. ఇర్వింగ్‌లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ డాలస్ నగరంలోని

స్కాట్లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు

టీడీపీ  ఎన్నారై  విభాగం ఆధ్వర్యంలో స్కాట్లాండ్‌లో  మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. స్థానిక అప్‌హాల్ కమÖ్యనిటీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ వర్చువల్‌గా ప్రసంగించారు.  ప్రవాసాంధ్రులు టీడీపీకి అండగా నిలవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ పొట్లూరి, డాక్టర్ శ్రీకాంత్ లావు, రమేశ్ గోల్కొండ పాల్గొన్నారు.

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌

వెట్టి చాకిరి నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు భారత్‌తో సహా 60 దేశాలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ ట్రేడ్ ప్రతినిధి అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. యూఎస్‌టీఆర్‌ జెమీసన్‌ గ్రీర్‌ ప్రకారం, ఈ విషయంలో తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా విఫలమయ్యాయి. వెట్టి చాకిరి కారణంగా అమెరికా కార్మికులు అంతర్జాతీయ లేబర్‌ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకం

న్యూజెర్సీలో ఘనంగా తానా పికిల్‌బాల్ టోర్నమెంట్

అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది. వివిధ ప్రాంతాల నుంచి పికిల్‌బాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ టోర్నీకి తెలుగు కుటుంబాలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. టోర్నీలో విజేతలకు 500 డాలర్లు, రన్నరప్‌లకు 250 డాలర్లు, ద్వితీయ రన్నరప్‌లకు 150 డాలర్ల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా తానా కోశాధికారి

ఇజ్రాయెల్‌ ప్రధానిపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య  జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ ‌లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు, ఇరాన్ ‌తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన, ఘాటైన పదజాలం ఉపయోగించారని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ

అమెరికాలో 30 మంది భార‌తీయులు అరెస్టు

అమెరికాలో అక్ర‌మంగా జీవిస్తూ క‌మ‌ర్షియ‌ల్ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు గా ప‌నిచేస్తున్న సుమారు 30 మంది భార‌తీయుల‌ను అరెస్టు చేశారు. ఫెడ‌రల్ ఆప‌రేష‌న్‌లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌ను త్వ‌ర‌లో డిపోర్టు చేయ‌నున్నారు. అమెరికా క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ శాఖ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. మే 11 నుంచి 15వ తేదీ మ‌ధ్య జ‌రిగిన ఆప‌రేష‌న్ చెక్‌మేట్‌లో భాగంగా అక్ర‌మ డ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం

గ్రీన్ కార్డ్‌ నిబంధనలపై .. అమెరికా యూటర్న్

అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది.  తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ  మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్‌ఎస్‌ వివరణ

ఆటా మహాసభలకు కేటీఆర్‌కు ఆహ్వానం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2వ తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభల‌కు హాజరుకావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్‌కు

తాజ్‌మహల్ ను సందర్శించిన డొనాల్డ్ ట్రంప్ కూతురు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ శనివారం తన భర్త మైకేల్ బౌలోస్‌తో కలిసి ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించారు. దాదాపు గంటసేపు ఆ కట్టడంలో గడిపి అనేక విశేషాలు తెలుసుకున్నారు. తన భర్త బౌలోస్‌తోపాటు కొంతమంది సన్నిహిత స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 11 గంటలకు ఆమె తాజ్‌మహల్‌కు విచ్చేశారు. తాజ్‌మహల్ లోని అనేక ప్రదేశాలను ఫోటోలు తీసుకున్నారు. తాజ్‌మహల్ చరిత్ర, నిర్మాణం గురించి ఆమె ఎక్కువ ఆసక్తి

అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు … 60 రోజుల ఎంవోయూకు ఓకే

అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అలాగే, హార్ముజ్ జలసంధిని తెరవాలని కూడా నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య ప్రధాన అడ్డంకిగా ఉన్న అణ్వాయుధ కార్యక్రమంపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.  ప్రస్తుతం ఈ అంశాలన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటికి

బే ఏరియాలో మహానాడుకు తరలిరండి

టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ను అమెరికాతో పాటు పలు దేశాల్లో నివసిస్తున్న ఎన్నారై టీడీపీ నేతలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బే ఏరియాలో మే 28న మహానాడు తో పాటు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, ప్రజా నాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని నిర్వహించబోతున్నారు. శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ ఏడాది మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్‌లో

కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని

కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. అలాగే, తన ఖర్చుల కోసం అక్కడ పని చేస్తోంది కూడా. త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా

పాక్‌ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య : లిండ్సేగ్రాహం 

పాక్ ప్ర‌భుత్వంపై అమెరికా సెనెట‌ర్ లిండ్సేగ్రాహం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల్లో పాక్‌ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు.అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుపై పాక్‌ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇజ్రాయిల్ తో పాకిస్థాన్‌కు వైరం ఉంద‌ని, దీంతో శాంతి చ‌ర్చ‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు. 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను

అమెరికాలో ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాలోని యాదవపాలేనికి చెందిన పూర్ణ గోపి మృతి చెందగా అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి

రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు.. ఘన స్వాగతం పలికిన జిన్‌పింగ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు.  పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ వార్, వ్యాపార, వాణిజ్య,

డొనాల్డ్ ట్రంప్ కు షాక్

ఇరాన్‌లో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారాలకు సెనెట్ కళ్లెం వేసింది. కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. తమ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక దాడి చేసేందుకు ట్రంప్‌నకు అవకాశం లేకుండా చేసింది. ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిలా ఉన్నాడు అని డెమోక్రటిక్‌ సెనెటర్ చక్‌ షుమర్‌ వ్యాఖ్యానించారు.

భార‌త్‌తో డీల్‌కు అమెరికా ప్ర‌భుత్వం ఓకే

భార‌త్‌తో ర‌క్ష‌ణ ఒప్పందానికి అమెరికా క్లియ‌రెన్స్ ఇచ్చింది. సుమారు 4 వేల కోట్ల ఖ‌రీదైన రెండు మిలిట‌రీ ఒప్పందాల‌కు అమెరికా విదేశాంగ శాఖ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా నుంచి అపాచీ, హోవిజ్జ‌ర్ విమానాల‌ను ఇండియా కొనుగోలు చేస్తుంది. అయితే ఆ మిలిట‌రీ డీల్‌కు అమెరికా స‌ర్కారు అనుమ‌తి ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. అపాచీ హెలికాప్ట‌ర్ల స‌పోర్టు స‌ర్వీస్ కోసం సుమారు 19.8 కోట్ల డాల‌ర్లు, ఆల్ట్రా

భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్, భారత పర్యట షెడ్యూల్ ను క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ తెలిపారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చెప్పారు. మరింత సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, బ్రిక్స్ నాయకులు గత ఏడాది

శాంతి స్థాపనలో భారత్ కీలక పాత్ర పోషించాలి: అబ్బాస్ అరాగ్చీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు.  బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు దైపాక్షిక, దౌత్యపరమైన చర్చలు మాత్రమే మార్గం అని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు ఇండియా ఎలాంటి

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్

ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్‌పై మరింత గ్లామరస్‌గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. లొరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన అలియా,

ఆమెతో పెళ్లి కాకపోతే జీవితాంతం బ్యాచిలర్‌గానే

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయురాలు ఉషతో తనకు పెళ్లి కాకుంటే తాను జీవితాంతం బ్యాచిలర్‌  గానే ఉండిపోయేవాడినని చెప్పారు. ఉషను తొలిసారి చూడగానే, చేసుకుంటే ఉషనే పెళ్లి చేసుకుంటా, లేదంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉంటా అని తాను అప్పట్లో తన స్నేహితులతో చెప్పానని అన్నారు. వాన్స్‌ తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. రాజధాని బీజింగ్‌లో బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ట్రంప్ చైనాలో అడుగుపెట్టారు. రెండు రోజులపాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఒకపక్క ఇరాన్‌తో యుద్ధం సాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ అధ్యక్ష హోదాలో చైనాలో

భారత ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం : రష్యా

మిత్రదేశం భారత్‌ కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వమని రష్యా హామీ ఇచ్చింది. భారత్‌ విషయంలో చమురు సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్  చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని అన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్‌ మాట్లాడారు. ప్రపంచం చూసిన శక్తిమంతమైన నాయకుల్లో ప్రధాని మోదీ

అమెరికా మేయర్‌ పై ఎఫ్‌బీఐ సంచలన ఆరోపణలు

అమెరికా దేశం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆర్కడియా కౌంటీ  మేయర్‌ ఐలీన్‌ వాంగ్‌  పై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సంచలన ఆరోపణలు చేసింది. వాంగ్‌ చైనా  కు చట్టవిరుద్ధమైన ఏజెంట్‌గా వ్యవహరించినట్లు అభియోగాలు మోపింది. యాభై ఎనిమిదేళ్ల ఐలీన్‌ వాంగ్‌ 2022లో ఆర్కడియా కౌంటీకి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికకు ముందు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌సి) కు ఆమె అక్రమ ఏజెంట్‌గా వ్యవహరించారని ఎఫ్‌బీఐ అభియోగాలు

చైనాలో డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడు రోజులు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ట్రంప్‌ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారు. ట్రంప్‌ తమ దేశ పర్యటనకు వస్తున్నారని చైనా విదేశాంగ శాఖ  ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ట్రంప్‌ అమెరికా అధ్యక్షుని హోదాలో చైనాకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ చివరిసారిగా తన తొలి టర్మ్‌లో 2017లో అధ్యక్ష హోదాలో చైనాను

అమెరికాలో భార‌తీయ వ్య‌క్తి దాతృత్వం

అమెరికాలోని నార్త్ క‌రోలినా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన విల్స‌న్ కాలేజ్ ఆఫ్ టెక్స్‌టైల్స్ విద్యార్థులను భార‌తీయ సంత‌తి వ్య‌క్తి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న 176 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల రుణాలు చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ర‌లేగ్‌లోని రేనాల్డ్స్ కొలేషియంలో గ్రాడ్యుయేష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది. భార‌తీయ వ్య‌క్తి అనిల్ కొచ్చార్ త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌న తండ్రి ప్ర‌కాశ్ చాంద్ కొచ్చార్ జ్ఞాప‌కంగా విద్యార్థుల రుణాల‌ను చెల్లిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పంజాబ్‌కు

తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన తానా స్కాలర్‌షిప్ వెబినార్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్‌షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.ఉన్నత విద్య అవకాశాలపై ఆసక్తితో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. కళాశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు పొందే విధానాలు, విద్యార్థుల

అమెరికాలో భారత విద్యార్థి మృతి

గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న మరుసటి రోజునే భారత విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన అమెరికాలో జరిగింది. మహమ్మద్ కుమెల్ షేక్ (26) శాన్ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఇటీవలే స్నాతకోత్సవ వేడుకల్లో … తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. అయితే, ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్టుకు గురై మృతి

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒకవైపు శాంతి ప్రక్రియ జరుగుతుండగా, ఇంకోవైపు అమెరికా సైనిక చర్య సరికాదని ఇరాన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారీ అమెరికా సైనిక చర్యకు దిగుతోందని విమర్శించారు. ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హత్యకు కుట్ర .. భద్రత మరింత కట్టుదిట్టం

గత ఐదుసంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేందుకు తనవంతు కర్తవ్యంగా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. పలుదఫాలుగా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలతో చర్చలు జరిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. యుద్ధం వల్ల ఇప్పటికే రెండుదేశాలు

బ్రిటన్‌ పార్లమెంట్‌లో భారత సంతతి వ్యక్తి ప్రసంగం

బ్రిటన్‌ పార్లమెంట్‌లో ని ఎగువ సభ (హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌)లో లైఫ్‌ పీర్‌గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. హరింత ఇంధనంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ 2030 నాటికి దేశంలో కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యాన్ని కొనియాడారు. ఈ ప్రక్రియలో సాంకేతికత, సృజనాత్మకతకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ని జోడిస్తే అద్భుతాలు సాధించగలమని అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని శనిగరం

ఎన్‌ఆర్ఐ కమిటీలు అన్నీ రద్దు  :  మహేశ్ బిగాల

బీఆర్ఎస్ ఎన్ఆర్‌ఐ కమిటీలు అన్నీ రద్దయ్యాయి. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్‌ఆర్‌ఐ కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు.త్వరలోనే బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త సభ్యత్వ

డబ్లిన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో యాడమ్స్ టౌన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్‌ఐశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎపీఎన్ఆర్‌టి చైర్మన్ రవి కుమార్ వేమూరి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డబ్లిన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ నాయకులు, సభ్యులు కలిసి

డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తమకు ఇరాన్ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. పతనం అంచున ఉన్నందున తాము హార్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని ఇరాన్ కోరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ అంశంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, హార్ముజ్‌ను తెరిచేందుకు

టీడీపీ కార్యకర్తకు అండగా నిలిచిన ఎన్నారై తెలుగుదేశం కువైట్

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కార్యకర్త వి.శ్రీశైలానికి ఎన్నారై తెలుగుదేశం కువైట్ సాయంగా నిలిచింది. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్త వి.శ్రీశైలం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎన్నారై టీడీపీ కువైట్ నాయకుల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో పార్టీకి చురుగ్గా సేవలు అందిస్తున్న శ్రీశైలం క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు, ఎన్నారై టీడీపీ

యూఏఈ సంచలన నిర్ణయం …మే1 నుంచే అమల్లోకి

యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా కు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ లో చాలా ఏళ్లుగా

ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యం లో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్‌లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో

రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి:  కోమటి జయరాం

రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపునిచ్చారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభకు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ

డొనాల్డ్‌  ట్రంప్‌కు అమెరికన్ల షాక్

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనా తీరుపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను అభిశంసించాలని 55 శాతానికిపైగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్‌పై ట్రంప్‌ ఏకపక్షంగా సాగిస్తున్న యుద్ధాన్ని 66 శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ స్థాయి సర్వే తెలిపింది. ఇరాన్‌ యుద్ధం పేరుతో అమెరికా చేస్తున్న వ్యయం సరైంది కాదని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఏప్రిల్‌ 10-14 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,514

పీ-4 స్ఫూర్తితో త్రాగునీటి ట్యాంకర్, రైతులకు పరికరాలు : ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు, చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన తాగునీటి ట్యాంకర్‌ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి, పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75

భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ శుభవార్త

భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా  అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.  సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి, అక్కడి నుంచి మూడో దేశానికి వెళ్లేటప్పుడు

మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్ .. గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా

ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్‌‌‌లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం

గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా

వీసా ఫీజుల‌ను పెంచి ప‌లు దేశాలు హ‌డ‌లెత్తిస్తున్న విష‌యం తెలిసిందే. అక్ర‌మ వ‌ల‌స‌ల నెపంతో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌లు రకాల ఫీజుల‌ను భారీ పెంచింది. బ్రిట‌న్ కూడా యూఎస్ త‌ర‌హ‌లోని వీసా రుసుంలను పెంచింది. తాజాగా కెన‌డా మాత్రం అందుకు భిన్నంగా వీసా ఫీజుల‌ను త‌గ్గించింది. తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్‌ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని

ఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలోని పాయింట్ కుక్ మెల్‌బోర్న్‌లో టీడీపీ మెల్‌బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యక్షురాలు సుమ తాతినేని కీలక పాత్ర పోషించారు. టీడీపీ మెల్‌బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో ముందుచూపు ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే సామర్థ్యం ఆయనకు ఉందని

ఒప్పందం కుదరకపోతే … యుద్ధమే :ట్రంప్

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధమవుతామని ప్రకటించారు. కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా

జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్‌ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే

అమెరికా యూ టర్న్ .. ఇండియాకు ఊరట

చమురు సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతినిచ్చింది. ఇది ఇండియా సహా అనేక దేశాలకు ఊరట కలిగించే విషయం. గతంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల్ని అమెరికా విధించింది. అనంతరం ఇరాన్ యుద్దం నేపథ్యంలో ఆంక్షల్ని సడలించింది. తిరిగి మళ్లీ ఆంక్షలు విధించింది. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని, రష్యా నుంచి

జగిత్యాల సభను విజయవంతం చేయాలి : రాధారపు సతీష్

జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా

వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం

అమెరికా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (47) తన భార్య డాక్టర్ సెరీనా ఫెయిర్‌ఫాక్స్ (49)ను కాల్చి చంపి, ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వాషింగ్టన్ డిసి శివారు ప్రాంతమైన అన్నందలేలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ తన భార్యను ఇంటి బేస్‌మెంట్‌లో కాల్చి చంపి, ఆ

శాంతి చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం : అమెరికా హెచ్చరిక

అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు జరగబోతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా రెండో దశ శాంతి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సిద్ధమవుతున్నామని అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్

ఇరాన్-అమెరికా మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు: పాకిస్థాన్

ఇరాన్ -అమెరికా తదుపరి చర్చల దశ త్వరలో ఉండవచ్చని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పార్లమెంట్ భవనం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోలేదని, దీంతో చర్చలు కొంత మేర ఫలించాయన్న భావన కలిగిందని అన్నారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని సూచించారు.అమెరికా, ఇరాన్ మధ్య 21గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన సంగతి

న్యూయార్క్ అటార్నీ జనరల్ పోటీలో సరితా కోమటిరెడ్డి

అమెరికాలో మరో భారత సంతతి మహిళ ఉన్నత పదవికి పోటీ పడుతున్నారు.ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం  తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె, విజయంపై  ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా ఉన్న లటీషియా జేమ్స్‌తో సరిత తలపడనున్నారు. ఈ నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అమెరికా రాజకీయాల్లో

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం … 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా

ఆస్ట్రేలియా చరిత్రలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను ఆర్మీ చీఫ్ గా నియమించింది. దేశ రక్షణ దళాల నాయకత్వంలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా, చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ తమ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. ప్రస్తుత జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆస్ట్రేలియా

ఈ విషయంలో మద్దతు ఇవ్వడం లేదు .. డొనాల్డ్ ట్రంప్‌నకు బ్రిటన్ షాక్

హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తాము ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమ దేశం ఉద్రిక్తతలు

యూకేలో శాశ్వత నివాసం … నిబంధనలు కఠినతరం!

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ విషయాన్ని యూకే హోంశాఖ మంత్రి షబానా మహమూద్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం యూకేలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఐదేళ్లు ఆవాసం ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ ఐదేళ్ల గడువును పదేళ్లకు పెంచేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మరికొందరికి ఈ వ్యవధిని 20 ఏళ్లకు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.