వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆటల పోటీలను ప్రారంభించింది. అందులో భాగంగా కన్నపోలిస్‌లోని కరోలినా పికిల్‌బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది. బిగినర్, ఇంటర్మీడియెడ్, అడ్వాన్స్డ్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పోటీలు జరిగాయి. ఈ మెగా టోర్నమెంట్లో 65కు పైగా టీంలు ఉత్సాహంగా పాల్గొని తలపడ్డాయి. టోర్నమెంట్‌ను ఇంతటి భారీ స్థాయిలో విజయవంతం చేసిన ఆటగాళ్లను, నిర్వాహక బృందాన్ని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు ప్రత్యేకంగా అభినందించారు. తానా అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రవి(నాని) వడ్లమూడి నేతృత్వంలో ఈ ఈవెంట్ విజయవంతంగా సాగింది. చార్లెట్ పికిల్‌బాల్ టీం సభ్యులు తారక్ పూడి, కార్తీక్ పాండ్రా, పవన్ పెట్టంబరం వెంకట, స్పోర్ట్స్ చైర్ దినేష్ దొంగ తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు స్థానిక తానా నాయకులు రవి(నాని) వడ్లమూడి, నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, అన్నే రమణ ఈ టోర్నమెంట్ విజయానికి విశేష కృషి చేశారు.
ఈ కార్యక్రమం సజావుగా సాగడంలో తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి కీలక పాత్ర పోషించారు.ఈ ఈవెంట్‌కు స్పాన్సర్లుగా వ్యవహరించిన నవాబీ హైదరాబాద్ హౌస్, కోల్డ్‌వెల్ బ్యాంకర్ రియల్టీ – రఘు వేమూరి, ట్యుటెలరీ ఇంక్ సంస్థలకు తానా నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వేసవి కాలంలో తానా ఆధ్వర్యంలో మరిన్ని ఆటల పోటీలు జరగనున్నాయి. రాబోయే రోజుల్లో బ్యాడ్మింటన్, క్రికెట్, పురుషుల, మహిళల వాలీబాల్, కిడ్స్ స్పోర్ట్స్, ఐపీఎల్ స్టైల్ వాలీబాల్, త్రోబాల్ వంటి క్రీడా పోటీలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తానా సిద్ధమవుతోంది.

































