అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్.ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ లాంచ్ చేసిన కొత్తపోస్టర్ అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్. అదెలా అంటే తాజా పోస్టర్‌లో టైగర్ లుక్‌తో పాటు లెనిన్ టైటిల్ లోగోను చూడొచ్చు. ఇంతకీ ఈ కొత్త పోస్టర్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే, ఈ చిత్రానికి యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించడమే కాకుండా సినిమా కథనాన్ని వివరించబోతున్నాడట. ఈ పోస్టర్‌తో సినిమాలో తారక్ రోల్ ఏంటనేది క్లారిటీ ఇచ్చేసినట్టేనని అర్థమవుతోంది.
ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌తోపాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శివాజీ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లెనిన్ టైటిల్ గ్లింప్స్ మూవీ విలేజ్ బ్యాక్ర్‌డ్రాప్ నేపథ్యంలో సాగనున్నట్టు హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రం జులై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.

































