కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో మూడురోజులు పర్యటించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు మీడియాతో ప్రసంగించారు. జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్‌ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయని అన్నారు. రాయలసీమ
వికసిత్ భారత్ రోజ్‌గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లాలోని ముక్కువారిపల్లిలో వీబీ -జీ రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా చంద్రబాబు ప్రసంగించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ విద్యా, సమాచార సాంకేతిక (ఐటీ) శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలతో పాటు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.ఆలయ దర్శనంలో భాగంగా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా నిర్వహించే తిరుప్పావడ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడణవీస్‌కి, పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడపులులు ఇచ్చే
దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్‌ను. ఈరోజు ఇంతమంది యువతీయువకులకు పట్టాలు అందించడం
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు మరోసారి చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన తుది పిటిషన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. విచారణలో సునీల్ కుమార్ వాదనలు విన్న ట్రిబ్యునల్, ఆయనకు ఎలాంటి ఊరట కల్పించేందుకు నిరాకరించింది. సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న అభ్యర్థనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా పరిగణించి,
సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులుగా ఉన్న అశోక్, జంగం నాని పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ ఆటోలో వచ్చి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అశోక్, జంగం నానిపై కేసులు నమోదయ్యాయి. ఘటన అనంతరం వీరిద్దరూ పరారీలో ఉండగా, తాజాగా పోలీసుల ఎదుట హాజరై లొంగిపోయారు.
వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. 3
వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లారా లేక రాజధానిలో రౌడీయిజం చేయటానికి వెళ్లారా అని ప్రశ్నించారు. మీరు వెళ్తే సమస్య వస్తుందని పోలీసులు ముందే చెప్పారు. మీరు వెళ్లిన పెనుమాకలో 90% రైతులు రాజధానికి భూములు ఇచ్చినవారే. రైతులపై రౌడీయిజం చేయడానికి గూండాలని వెంటబెట్టుకుని వెళ్లారు అంటూ ఆగ్రహం వ్యక్తం
ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ అభియాన్ – విక్షిత్ భారత్ కీ పెహచాన్ థీమ్‌తో నిర్వహించి వర్క్‌షాప్‌కు హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గంజాయి మత్తులో పడి జైల్లో ఉన్న బిడ్డను విడుదల చేసేందకు ఏ పేరెంట్స్ కూడా
ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్వర్ణయుగం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ. 405 కోట్ల పెట్టుబడితో ఈ గనిని అభివృద్ధి చేసింది. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం
యోగా సాధనతో బాబా రామ్ దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాబారామ్ దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని, ఆధ్యాత్మికతతో కూడిన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. సాయికృష్ణ తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బోడెప్రసాద్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ సాయికృష్ణ తల్లి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని
తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది. రాష్ట్రంలో నూతన విద్యా విప్లవానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అంతర్జాతీయ విద్యా హబ్‌గా మార్చేందుకు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. మైసూరు కేంద్రంగా విద్యాసేవలు అందిస్తున్న ప్రతిష్టాత్మక జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎస్ఎస్) మహావిద్యాపీఠం, తమ నూతన ఆఫ్-క్యాంపస్‌ను తిరుపతిలో నిర్మించనుంది. అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎస్ఎస్ సంస్థల మధ్య
దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా పిఎం మోడీ రికార్డు సృష్టించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలనను పురస్కరించుకొని విజయవాడలోని వాజ్‌పేయి పార్క్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలని, కానీ విధానపరంగానే ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ రీకౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి మాట్లాడుటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారన్నారు. కేవలం అనితను అన్నట్టు కాదని మహిళలందరినీ కించపరిచినట్లేనని మండిపడ్డారు. ఒక విషయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక రంగ సహకారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో సహకారం అందించాలని సీఎం
కువైట్‌లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫర్వానియా ద్వైహి ప్యాలెస్ హోటెల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభత్వం గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గల్ఫ్ ఎంపర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు వివరించారు. కూటమి ప్రభుత్వం నమ్మకానికి మారుపేరని, మరో పదిహేను
హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సంస్కారహీన, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా అమర్‌నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలితీసుకుందని ధ్వజమెత్తారు. బాబాయి హంతకులను కాపాడుతూ, న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు.
విభజన వల్ల కొంత నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా దామినేడులో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం నినాదంతో కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజా వేదిక కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టారని అన్నారు. ఐదేళ్లు విధ్వంసమే కొనసాగించారని, ఇన్వెస్టర్లను వేధించి, వెంటాడి తరిమేశారని విమర్శించారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని, చీకటి పాలనపై పోరాడితే జైల్లో పెట్టారని
రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు, బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతి జిల్లా దామినేడులో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం నినాదంతో కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం పార్టీలది కాదు, ప్రజలది అని అన్నారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అహంకార విధ్వంసంపై ప్రజలు సాధించిన విజయం ఇది
అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సురేశ్ మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ, విచారణను మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్‌తో పాటు పది చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఈ
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీటీపీ నుంచి సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా, జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. అయితే, పోటీలో నలుగురు అభ్యర్థులే నిలవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కార్మికులు, యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదు. 30 ఏళ్లలో ఇలాంటి ఘటనను మేము ఎప్పుడూ చూడలేదని కార్మికులే చెబుతున్నారన్నారు. విశాఖ ఉక్కును కాపాడటమే
జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, గళ్లా రామచంద్ర రావు పాల్గొన్నారు.ఎన్‌ఆర్‌ఐ-టీడీపీ జర్మనీ విభాగానికి సంబంధించి వెబ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్‌లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 9మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా
రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీ ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ఆయా
ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగరంలో జయరాం కోమటి పర్యటించారు. ఇర్వింగ్‌లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ డాలస్ నగరంలోని
రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
టిడిపి ఎమ్మెల్యేలు సీరియస్ గా లేకపోతే ఇబ్బందులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలోనూ భేటీకి కొంతమంది రాలేదని అన్నారు. సర్ వర్క్ షాపు కు హాజరు కాని కొంతమంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఆ రోజే సీరియస్ గా చెప్పానని, కానీ కొంతమంది లో మార్పు రాలేదని, కీలక సమావేశాలకు రాకపోతే ఎలా అని
తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహానాడును సమర్థంగా నిర్వహించడంలో భాగస్వాములైన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు జోనల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్ముందు పార్టీ తరఫున నిర్వహించే భారీ కార్యక్రమాలకు మహానాడు-2026ను బెంచ్ మార్క్‌గా తీసుకోవాలని సూచించారు. ఏపీతో పాటు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై
మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని మహిళా మహానాడుగా ఆయన అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17.50 లక్షల మంది హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు గతంలో ఆస్తి హక్కు
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని సుమారు ఏడున్నర గంటల పాటు ఇడి విచారించింది. బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరి పేర్లను అధికారులకు చెప్పలేదని
జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు ప్రారంభం సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. 1875 క్లస్టర్‌ల వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు-2026 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానం లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ, పార్టీ కేడర్‌లో మాత్రం పసుపు పండగ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి పెట్టని కోటగా ఉన్న మహిళలకు, రేపటి భవిష్యత్తు అయిన యువతకు ఈ మహానాడులో అగ్రతాంబూలం ఇచ్చారు. మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఒక
అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాలోని యాదవపాలేనికి చెందిన పూర్ణ గోపి మృతి చెందగా అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి
మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు
సముద్రంలో చేపల వేట చాలా కష్టమైన పని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం పర్యటించారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికగా మత్స్యకారుల సేవ కార్యక్రమం జరిగింది. మత్స్యకారుల సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చేపల వేటకు ఎంతో ధైర్యం కావాలని అన్నారు. ఉవ్వెత్తున ఎగిసినపడే అలలకు సైతం ఎదురెళ్లే గుండె ధైర్యం కావాలని, జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కష్టాలు అన్నింటినీ అధిగమిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల భూముల జోలికి రాకుండా టెక్నాలజీ వాడుతున్నామని, స్వచ్ఛాంధ్ర అంటే చెత్తను శుభ్రం చేయడమే కాదని ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యగా మారిందని, పిల్లలు భారం కాదని వాళ్లే మన సంపదని తెలియజేశారు.
పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి సత్య సాయిబాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడిందని తెలిపారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ(డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఎస్(ఆల్ ఇండియా సర్వీసెస్) రూల్ 16(1)(డిసిఆర్‌బి) 1958 ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డులో నామినేట్ సభ్యులుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులకు అవకాశం కల్పించింది. కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క
గండి క్షేత్రం మఠాధిపతుల సమక్షంలో సంప్రోక్షణ, కలశాభిషేకం జరుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గండి క్షేత్రాన్ని రూ.28 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ గండి క్షేత్రానికి ఏటా రూ. 5.62 కోట్ల ఆదాయం వస్తోందని, ఇప్పటికే రూ. 9.47 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలియజేశారు. కామన్ గుడ్ ఫండ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు వివరించారు. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. అమరావతిలో మరిన్ని కేంద్ర
పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని వివరించారు. 1990 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని
విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రాంచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధా కృష్ణ, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా,
పాలనకు టెక్నాలజీతో పాటు మానవతా దృక్పథం కూడా ముఖ్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెరగాలని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సిఎం సంతృప్తి చెందారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ ముఖ్యమైన అంశం అని ఫైళ్లను
ప్రజా సమస్యలను వంద శాతం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఏడో విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సింగపూర్‌లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. సింగపూర్‌లోని అత్యుత్తమ విధానాలను తీసుకుని
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జీవో నంబర్ 900ను జారీ చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికలో బయటపడిన అంశాలు, సిఫార్సులను వివరంగా అధ్యయనం చేయాలని ఆదేశించింది. పాలనాపరంగా అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై
భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘ ఆయుష్షుతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జీవించాలని ఆకాంక్షించారు. అంకితభావంతో దేశానికి ఆయన సేవలు అందించాలన్నారు. దేశ ప్రగతి కోసం ఆయన చేసే ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.నిజాయతీ, స్థిరమైన నాయకత్వంతో పార్లమెంటరీ కార్యకలాపాలను పటిష్ఠ పరిచేందుకు చేసే ప్రయత్నాల్లో ఆయన మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మహానాడును ఇఫ్కోసెజ్‌లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అక్కడ రెండు వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామని,ఈ నెల
తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినాయకత్వం పాత, కొత్త నాయకుల కలయికతో కమిటీలను ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు
గూగుల్ రాక ఏపీకి గేమ్ ఛేంజర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. విశాఖ పట్నం తర్లువాడలో గూగుల్ ఏఐ సెంటర్ కు సిఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నం చాలా అందమైన ప్రదేశం అని ఏపీ చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఈ ప్రాజెక్టు రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం కొనియాడారు. టెక్నాలజీలో
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో యాడమ్స్ టౌన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్‌ఐశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎపీఎన్ఆర్‌టి చైర్మన్ రవి కుమార్ వేమూరి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డబ్లిన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ నాయకులు, సభ్యులు కలిసి
విశాఖ పట్టణం ముఖ చిత్రం ఒక్కరోజు నుంచే మారబోతుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖ తర్లువాడలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ కు భూమిపూజ చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, సిఎం చంద్రబాబు, లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని ఆనాడు అనుకున్న నిర్ణయం ఈనాడు కార్యరూపం దాల్చిందని అన్నారు.
విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. వన్ గిగా వాట్ సామర్థ్యంతో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అన్ని రకాల
దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) నే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఏయూ దేశంలోనే టాప్-5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూకు రూ.500 కోట్ల నిధులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో రూ.500 కోట్లు కార్పస్ అభివృద్ధి కావాలని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు, చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన తాగునీటి ట్యాంకర్‌ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి, పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75
విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం, రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను అదృష్టం వరించిందని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు
ఆస్ట్రేలియాలోని పాయింట్ కుక్ మెల్‌బోర్న్‌లో టీడీపీ మెల్‌బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యక్షురాలు సుమ తాతినేని కీలక పాత్ర పోషించారు. టీడీపీ మెల్‌బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో ముందుచూపు ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే సామర్థ్యం ఆయనకు ఉందని
వైసీపీ రాజకీయ పార్టీ కాదని, హత్య రాజకీయాలకు డెన్‌గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్థసారథి మీడియా తో మాట్లాడారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనక ఆ పార్టీ పెద్దల హస్తం
కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని ఆశపడ్డారని అన్నారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహమని, మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతని తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని ఆవేదన
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2, 4 సోమవారాల్లో విచారణ అధికారుల ఎదుట హాజరవ్వాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. విజయవాడ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన – నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ వినుకొండ మేనేజర్ అర్జునరావు – దర్శి మున్సిపల్ కమిషనర్‌గా నియామకం పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్ మునికుమార్ – రెగ్యులర్ కమిషనర్‌గా పదోన్నతి విజయవాడ నుంచి సుభాష్ చంద్రబోస్
లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న నారీ శక్తి వందన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ లేదా 8వ తేదీన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి
విద్యార్థి నాయకుడి కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ జరిపే వరకు ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు సీడీని తమ ముందు ఉంచాలని వారికి కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్‌నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా
ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం
దేశంలో అన్ని పార్టిలది ఒక దారైతే, వైసిపి మరో దారని, అమరావతి బిల్లుకు వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని అన్నారు. వైసిపి నేతలు, ఎపికి, ప్రజలకు ద్రోహం చేశారని, ఎపి నాశనమైనా పర్వాలేదని వైసిపి పట్టుదలతో ముందుకెళ్లిందని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలని వైసిపి చూస్తే,
రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ, స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే, వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ తరపున ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈరోజు(బుధవారం) ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో
లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- నా రాజధాని అమరావతి అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంట్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమెరికాలోని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ల ఆధ్వర్యంలో ఐటీ రంగం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో
ప్రజా రాజధాని అమరావతి అని, తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని గుర్తుచేశారు. ఆ కాలం నాటి అమరావతి విశేషాలను బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు. తెలుగువారిని గతంలో మదరాసీలు అని పిలిచేవారని,
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్‌ను అరెస్టు చేసి, విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ బ్రీఫింగ్‌లో ఈ విషయాలను వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్-5ను సవరించి, సీఆర్డీఏ పరిధిలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. భవిష్యత్తులో ఎవరూ రాజకీయ కారణాలతో రాజధానిని మార్చకుండా ఉండేందుకు అసెంబ్లీలో కూడా ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. గత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
వైసీపీ నేత పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తన కంపెనీకి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరుతూ ఆయన సతీమణి పేరిట దాఖలు చేసిన పిటిషన్‌ను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గత ప్రభుత్వ కాలంలో పి.ఎల్.ఆర్ కంపెనీ ద్వారా చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించి బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును పెద్దిరెడ్డి ఆశ్రయించారు. అయితే, ఈ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు, అర్చకులు ఆలయ మహా ద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను
తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. తిరుమలలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కి అదనంగా కేంద్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో పార్థసారథి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని భక్షించే వారే హిందూ ధర్మ రక్ష అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా, కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవడమే వైసీపీ నైజమని ఆరోపించారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అవినాశ్‌కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-7గా ఉన్న అవినాశ్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ ఐటి) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతితో జరిగిన ఈ విచారణలో అవినాశ్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ఉగాది
ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో షర్మిల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వివేకా కుమార్తె సునీత మీద చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని అన్నారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని సునీతానే చెప్పారని, అవినాశ్‌రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. అవినాశ్‌రెడ్డికి పలుకుబడి, డబ్బు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న అతన్ని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగాయని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముప్పిడి అవినాశ్‌రెడ్డి పాత్రపై
ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకు అందరు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హరియాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ
దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరి వేసుకుంటుండగా ఎలా వేసుకోవాలని భర్త ఫ్లాన్ ఇవ్వడమే కాగా వీడియో రికార్డు చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయినపల్లి గ్రామంలో శ్రీరామ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రైల్వేలో లోకో ఫైలట్‌గా పని చేస్తున్నాడు. తన భార్య కృష్ణవేణితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.