My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ(డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఎస్(ఆల్ ఇండియా సర్వీసెస్) రూల్ 16(1)(డిసిఆర్‌బి) 1958 ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఓపీటీ అండర్ […]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ(డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఎస్(ఆల్ ఇండియా సర్వీసెస్) రూల్ 16(1)(డిసిఆర్‌బి) 1958 ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఓపీటీ అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ లేఖలో స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోనే (మే నెల) సాయి ప్రసాద్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన పదవీకాలం పొడిగింపునకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో నవంబర్ 30, 2026 వరకు సాయి ప్రసాద్, ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు కేంద్రం ఈ అధికారిక సమాచారాన్ని అందించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.