పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపిల రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డ నేపథ్యంలో తిరిగి ఎన్నిల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపిలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. జులై 24వ తేదీన మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. నామినేషన్ల సమర్పణకు జులై 14 ఆఖరి తేదీ అని పేర్కొంది. జులై 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మూడు స్థానాలు బిజెపి ఖతాలోకి చేరే అవకాశం ఉంది.

































