తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. తిరుమలలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కి అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రస్తావించారు.
కొద్దికాలం వ్యవధిలోనే తిరుమలలో పరిశోధన శాలను ప్రారంభించామని తెలిపారు. ఈ పరిశోధనశాలలో అనేక పరీక్షలు చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పాలు, నెయ్యి, నూనెతో పాటు ముడి సరుకుల నాణ్యతను పరీక్షించవచ్చని చెప్పుకొచ్చారు. రూ.25 కోట్లతో నిర్మించిన ఈ పరిశోధన శాలలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని వెల్లడించారు.


