ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు వివరించారు. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతం వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అమిత్ షాకు వివరించారు.


