రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీ ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ఆయా పార్టీల నేతలు విలేకర్లతో మాట్లాడారు.
నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ-3, జనసేన-1 తీసుకోవాలని నిర్ణయించామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు.


