యోగా సాధనతో బాబా రామ్ దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాబారామ్ దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరం అని సూచించారు. ప్రపంచవ్యాపంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఎపి మారనుందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు అని బాబారామ్ దేవ్ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. బాబారామ్ దేవ్ తో కలిసి చంద్రబాబు యోగా సాధన చేశారు. బాబారామ్ దేవ్ శిక్షణలో జరగుతున్న యోగా సాధననను తిలకించారు. వివిధ రకాల యోగా ప్రకియలను సిఎంకు వివరించారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం అని అమరావతి దేవతల రాజధాని, ఇప్పుడు యోగా రాజధాని అని బాబారామ్ దేవ్ ప్రశంసించారు.
…….

































