దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరి వేసుకుంటుండగా ఎలా వేసుకోవాలని భర్త ఫ్లాన్ ఇవ్వడమే కాగా వీడియో రికార్డు చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయినపల్లి గ్రామంలో శ్రీరామ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రైల్వేలో లోకో ఫైలట్‌గా పని చేస్తున్నాడు. తన భార్య కృష్ణవేణితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని భర్తను భార్య బెదిరించింది. భార్య ఉరివేసుకుంటుండగా భర్త వీడియో తీయడంతో పాటు ఎలా ఉరి వేసుకోవాలో సలహా ఇస్తున్నాడు. ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి మృతికి భార్తే కారణమని అతడిని శిక్షించాలని ఆమె బంధువులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


