లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని అన్నారు. తెలంగాణలో విమానయాన రంగం వెనుకబాటుకు గతంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆయన ధ్వజమెత్తారు. విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా అమరావతిని రాజధానిగా చెప్పుకోలేని పరిస్థితి రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి కావాల్సి ఉందని అన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా అమరావతిని రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ తరఫున అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.


