కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్‌గాంధీ పలు సూచనలు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీతో జరిగిన ఈ భేటీలో షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా పాల్గొనడం గమనార్హం.


