My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి

దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా పిఎం మోడీ రికార్డు సృష్టించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలనను పురస్కరించుకొని విజయవాడలోని వాజ్‌పేయి పార్క్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మీడియాతో […]

దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా పిఎం మోడీ రికార్డు సృష్టించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలనను పురస్కరించుకొని విజయవాడలోని వాజ్‌పేయి పార్క్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని జోషి ప్రశంసించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగాయని, అమరావతి కోసం రూ.15 వేలకోట్లు ఇచ్చామన్నారు. అమరావతికి రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంచుతున్నామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. భారతరత్న దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహానికి పుష్పార్చన, పూలమాలలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వేశారు. అనంతరం వాజ్‌పేయి దేశాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. తదుపరి, పార్క్‌లో వాకర్స్‌తో కలిసి నడుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
…………

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.