అమెరికాలోని వర్జీనియాలో ఫాదర్స్ డే వేడుకలు తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా- పాఠశాల చైర్మన్ భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక కుటుంబానికి బలమైన ఆధారం, మార్గదర్శి, రక్షకుడని అన్నారు. ఎన్నారైలకు, వారి కుటుంబ సభ్యులకు వంద టికెట్లు జారే చేస్తున్నామన్నారు. అలాగే అమెరికాలోని ఆరు నగరాలలో శ్రీనివాస కల్యాణం జరిపించాలని నిర్ణయించామని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ జీవితంలో ప్రతి అడుగులోనూ మనకు ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత, విలువలను నేర్పించే మొదటి గురువు తండ్రేనని చెప్పారు. మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తల్లి ప్రేమను వ్యక్తపరుస్తే, తండ్రి ప్రేమను తన కష్టాల ద్వారా చూపిస్తాడని చెప్పారు. కుటుంబం సంతోషంగా ఉండాలని తన సుఖాలను త్యాగం చేస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మహానుభావుడు తండ్రి అని ప్రశంసించారు.భాను మాగులూరి మాట్లాడుతూ ఫాథర్స్ డే కార్యక్రమం సందర్భంగా హాజరైన తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మాతృభూమి, మాతృబాష రెండుకళ్లుగా భావించే ప్రవాస భారతీయులందరి జీవితాలలో తండ్రిది అగ్రస్థానమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు రవి అడుసుమిల్లి, ఉపాధ్యక్షుడు సుశాంత్ మన్నే, ప్రవాస పెద్దలు సీతారామారావు ఎండూరు, రమేష్ అవిర్నేని, చంద్రనాధ్ నంబూరు, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం, వెంకటరెడ్డి గోలి, సుబ్బారెడ్డి జొన్నల, వీరభద్రరావు వల్లభనేని, సురేష్ దొంతుల, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, సుదర్శన్ అమరవాది, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, ప్రభులింగం బచ్చు పాల్గొన్నారు.

































