విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 9మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

































