ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీటీపీ నుంచి సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా, జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. అయితే, పోటీలో నలుగురు అభ్యర్థులే నిలవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రిటర్నింగ్ అధికారిణి వనిత రాణి ఎన్నికైన అభ్యర్థులకు అధికారికంగా ధృవీకరణ పత్రాలు (ఫారం-22) అందించనున్నారు. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన. 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.

































