ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు-2026 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానం లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ, పార్టీ కేడర్‌లో మాత్రం పసుపు పండగ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి పెట్టని కోటగా ఉన్న మహిళలకు, రేపటి భవిష్యత్తు అయిన యువతకు ఈ మహానాడులో అగ్రతాంబూలం ఇచ్చారు. మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా సరే, తమ పార్టీ తరపున కచ్చితంగా 33 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని లోకేశ్ ప్రకటించారు.


