విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రాంచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధా కృష్ణ, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. లోకేశ్ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు తెలిపారు.


