విభజన వల్ల కొంత నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా దామినేడులో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం నినాదంతో కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజా వేదిక కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టారని అన్నారు. ఐదేళ్లు విధ్వంసమే కొనసాగించారని, ఇన్వెస్టర్లను వేధించి, వెంటాడి తరిమేశారని విమర్శించారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారని, చీకటి పాలనపై పోరాడితే జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఎన్డియే ను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడారని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అంశాల్లో కేంద్రం అండగా ఉందని అన్నారు. 21 శతాబ్ధం ప్రధాని నరేంద్ర మోడీదేనని, 2001 లో గుజరాత్ సిఎం అయ్యారు, 2014 లో ప్రధాని అయ్యారని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో మనదేశం పవర్ ఏంటో చూపించారని, మోడీ వల్ల ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని కొనియాడారు. 2047 నాటికి భారత్ తిరుగులేని శక్తిగా తయారవుతుందని, ఏడుగురు పిల్లలు ఉంటే ఏడుగురికి తల్లికి వందనం ఇచ్చామని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20 వేలు ఇచ్చామని అన్నారు. పుట్టపర్తిలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ తయారవుతోందని, తిరుమల శ్రీవారికే అపచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లు కూడా శ్రీవారి జోలికి రాలేదని, కానీ వైసిపి మాత్రం ఇంకా అపవిత్రం చేయాలని చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వామివారి పవిత్రను కాపాడుకునే శక్తి తమకు ఉందని చేశారు.


