అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాలోని యాదవపాలేనికి చెందిన పూర్ణ గోపి మృతి చెందగా అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.
బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆవుల పూర్ణగోపీ (35) అమెరికాలో స్థిరపడ్డాడు. న్యూ మెక్సికోలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రీనివాసరావు తన భార్య, చిన్న కుమారుడితో కలిసి గోపీని చూసేందుకు అమెరికా వెళ్లాడు.గోపి మరణంతో యాదవపాలంలో విషాదఛాయలు అలముకున్నాయి.


