ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2, 4 సోమవారాల్లో విచారణ అధికారుల ఎదుట హాజరవ్వాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డిల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసింది. ఈ తీర్పును ఏప్రిల్ 24వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.


