అమెరికాలో మరో భారత సంతతి మహిళ ఉన్నత పదవికి పోటీ పడుతున్నారు.ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా ఉన్న లటీషియా జేమ్స్‌తో సరిత తలపడనున్నారు. ఈ నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అమెరికా రాజకీయాల్లో అనేక మంది భారత సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.


