రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపునిచ్చారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభకు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ విద్యా, వైద్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎన్నారైలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురాబోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి,గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ ప్రతినిధులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, ప్రవాస సంఘాల పెద్దలకు అభినందనలు తెలిపారు. ప్రవాస సంస్థ ఆటా ప్రతినిధులు కవిత చల్లా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, సత్యనారాయణ మన్నె, త్రిలోక్ కంతేటి, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.


