యునైటెడ్ కింగ్డమ్ లో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ విషయాన్ని యూకే హోంశాఖ మంత్రి షబానా మహమూద్ సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం యూకేలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఐదేళ్లు ఆవాసం ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ ఐదేళ్ల గడువును పదేళ్లకు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరికొందరికి ఈ వ్యవధిని 20 ఏళ్లకు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా యూకే వీసా అర్హత నిబంధనలను కూడా కఠినతరం చేయనున్నారు. ఆ నిబంధనల ప్రకారం వలసదారులకు నేర చరిత్ర లేకుండా ఉండాలి. గత మూడు సంవత్సరాలుగా ఏటా 12,570 పౌండ్ల కంటే ఎక్కువ ఆర్జిస్తూ ఉండాలి.


