My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

గ్రీన్ కార్డ్‌ నిబంధనలపై .. అమెరికా యూటర్న్

అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది.  తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ  మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్‌ఎస్‌ వివరణ ఇచ్చింది. తాజా ప్రకటనలో డీహెచ్‌ఎస్ స్పందిస్తూ […]

అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది.  తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ  మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్‌ఎస్‌ వివరణ ఇచ్చింది.

తాజా ప్రకటనలో డీహెచ్‌ఎస్ స్పందిస్తూ ఇదేమీ విస్తృతస్థాయి విధాన మార్పేమీ కాదని వెల్లడించింది. దరఖాస్తుదారుడు గ్రీన్‌కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తిచేయాలా? స్వదేశానికి వెళ్లాలా? అన్నదానిని ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనే అని పేర్కొన్నది. ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తుచేయడమే మే 21న ఇచ్చిన మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సమయంలో కూడా వారు యూఎస్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది. వీసా ఓవర్‌స్టేలు, ఇమిగ్రేషన్‌కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం తాము పరిగణనలోకి తీసుకుంటామని సూచనప్రాయంగా వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.