ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వం లో తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో హిక్స్‌విల్లేలోని అసామై హిందూ టెంపుల్‌లో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశేష భక్త జన సందోహంతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, ఈవెంట్ కోఆర్డినేటర్ ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి తెలిపారు. సుమారు 500 మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, ప్రముఖ ఆగమ పండితులు శ్రీ వెంకటాచార్యులు (పిట్స్‌బర్గ్ హెడ్ ప్రీస్ట్), ప్రముఖ వేద పండితులు శ్రీ హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ విధానంలో ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి, కోశాధికారి రాజా కసుకుర్తి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ నారెపలేపు , యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీశ్ మేక, దశరథ్ తలపనేని తదితరులు హాజరై కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. తానా వలంటీర్లు ఆశ్రిత కోయి, సమన్విత మిన్నెకంటి, గీతికా చల్ల, వరుణ్ భర్తవరపు, శరణ్ భర్తవరపు, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, శ్రీప్రియా శ్రీధర్, కావ్య మల్లేపల్లి, మజ్జి తులసీలక్ష్మి, శాన్వి కంకణాల, అందించిన సేవలు కార్యక్రమ విజయానికి ముఖ్య కారణమయ్యాయి.ప్రత్యేకంగా దైవ భక్తి గీతాలు ఆలపించిన ఆశ్రిత కోయి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్పెషల్ గెస్ట్ టౌన్ అఫ్ నార్త్ హేంప్‌స్టీడ్ టౌన్ క్లర్క్, రాగిణి శ్రీవాస్తవ తానా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి తానా చేసే సేవలను కొనియాడారు.


