My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తమకు ఇరాన్ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. పతనం అంచున ఉన్నందున తాము హార్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని ఇరాన్ కోరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ అంశంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ ఇటీవల అమెరికాకు షరతు విధించిన […]

హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తమకు ఇరాన్ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. పతనం అంచున ఉన్నందున తాము హార్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని ఇరాన్ కోరిందని ట్రంప్ వెల్లడించారు.

అయితే, ఈ అంశంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ ఇటీవల అమెరికాకు షరతు విధించిన సంగతి తెలిసిందే. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధనం నుంచి తొలగిస్తేనే తాము ఈ జలసంధిని తెరుస్తామని ప్రకటించింది. ఈ జలసంధిపై ఇరాన్ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ చిన్న జలసంధి ప్రపంచ సముద్ర రవాణా మార్గానికి కీలకం. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకంగా మారింది. పాశ్చాత్య దేశాలు ఇరాన్ చమురుపై ఆంక్షలు విధించడంతో ఆయా దేశాల సరుకుల రవాణాపై ఇరాన్ నిషేధం విధిస్తూ, హార్ముజ్‌ను చెక్ పాయింట్గా వాడుకుంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.