మిత్రదేశమైన అమెరికా కంటే ఇజ్రాయెల్ భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు. ఆ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందమని అన్నారు. ఇరాన్- అమెరికా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అనిపిస్తే ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంటామని, ఆ అంశంలో ట్రంప్ తో విభేదాలు వస్తుంటాయని తెలియజేశారు. తాము ఇరాన్, అమెరికా ఒప్పందంపై కట్టుబడి ఉండమని, ఇరాన్ కు అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకుంటామని సూచించారు. ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా అడ్డుకోవడం తమ విధానమని, దీనిని ఏ ఒప్పందం మార్చలేదు అని ఇజ్రాయెల్ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అది నిజమైన మిత్రదేశం కాదని నెతన్యాహు పేర్కొన్నారు.

































