తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్, బీఆర్ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి పాల్గొన్నారు.

































