కువైత్‌లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తి అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి ప్రశంసించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. ప్రజా సేవలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ కువైత్ కోశాధికారి మోహన్ రాచూరి, అస్మా, పర్వానియా, హవాలి గవర్నరెట్ అధ్యక్షుడు ముస్తాక్ ఖాన్, రెడ్డయ్య చౌదరి, రవి మలిశెట్టి, ఎన్టీఆర్ సేవా సమితి ఉపాధ్యక్షుడు సీఆర్ రమేష్ నాయుడు, గుదే శంకర్, నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేష్, మైనార్టీ నాయకులు అర్షద్, తెలుగు యువత అధ్యక్షుడు మురళీ దుగ్గినేని, లోకేష్ యువసేన కువైత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన నాయకులు ప్రసాద్, మల్లికార్జున, శెట్టిపల్లి ప్రసాద్, మహిళ అధ్యక్షురాలు నారాయణమ్మ, దేవి చౌదరి, విజయ, సరోజ, శశి, అభిమానులు, ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కన్నయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

































