కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరుతున్న జీవన్ రెడ్డికి ఎన్నారైల పక్షాన ఎన్నారై నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాఘవ, ఉపాధ్యక్షుడు రవి రేతినేని, సత్యమూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్ఎస్ యూకే సీనియర్ నాయకులు గణేష్ కుప్పా, రమేష్ ఎసెంపెల్లి పాల్గొన్నారు.


