రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్, భారత పర్యట షెడ్యూల్ ను క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ తెలిపారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చెప్పారు. మరింత సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, బ్రిక్స్ నాయకులు గత ఏడాది జూలైలో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో చివరిసారిగా సమావేశమయ్యారు. ఈ నెల ప్రారంభంలో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు భారత్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక చర్చలు జరిపారు. ఒక ఏడాదిలో పుతిన్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. 2025 డిసెంబర్‌లో జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు న్యూఢిల్లీకి వచ్చారు.


