హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ప్రధాన రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్ స్పందించారు. భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అవెన్యూకు నా పేరు పెట్టారు. ఈ విధంగా గౌరవం పొందిన తొలి అధ్యక్షుడిని నేనే, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

































