తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒకవైపు శాంతి ప్రక్రియ జరుగుతుండగా, ఇంకోవైపు అమెరికా సైనిక చర్య సరికాదని ఇరాన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారీ అమెరికా సైనిక చర్యకు దిగుతోందని విమర్శించారు. ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా మాత్రం ప్రతిసారీ నిర్లక్ష్యంగా సైనిక చర్యకు దిగుతోంది. ఇదేమైనా బెదిరించే వ్యూహమా? లేదా ఇతరుల ఒత్తిడి వల్ల యుద్ధంలోకి చేరిన అమెరికా అధ్యక్షుడి పరిస్థితికి ఫలితమా? కారణం ఏదైనా ఇరాన్ మాత్రం ఎవరికీ, ఎలాంటి ఒత్తిడికీ తలవంచదు అని వెల్లడించారు.


