ఇరాన్‌పై అమెరికా యుద్ధం విషయంలో అమెరికా చట్టసభ నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఎదురుదెబ్బ తగిలింది. అనవసర వ్యయం, అనుచిత నిర్ణయాలతో సాగుతున్న ఇరాన్‌తో యుద్ధాన్ని నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభ స్పష్టం చేసింది. యుద్ధ అధికారాల తీర్మానం ( వార్ పవర్స్ రిసొల్యూషన్ )కీలక పరిణామంగా నిలిచింది. గురువారం జరిగిన సభలో సంబంధిత తీర్మానానికి అనుకూలంగా 215 మంది ఎంపిలు, వ్యతిరేకంగా 208 మంది ఓటేశారు. ప్రతినిధుల సభలో విదేశాంగ వ్యవహారాల కమిటీలో సీనియర్ సభ్యులు , డెమోక్రాటిక్ ఎంపి గెగోరి మీక్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ యుద్దం, ప్రజలకు మేలు జరగదు. పైగా అనుక్షణ ఉద్రిక్తతలు, అత్యధిక సైనిక వ్యయ భారం ఇకపై ప్రభుత్వ ఖజానాకు భారం అని వెంటనే యుద్ధం విరమించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం వెలువరించారు.


