జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి, అమరవీరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ గొప్ప పరిపాలనాదక్షకుడని పేర్కొన్నారు. కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతుందని వివరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ఈ కార్యక్రమములో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.


