ఒమన్ తీరంలో ఇటీవల భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. రూబియోతో మాట్లాడినట్లు జై శంకర్ పేర్కొన్నారు. గల్ఫ్‌లో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించడంపై భారత్ తరఫున నిరసన తెలిపారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రెండుసార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

































