తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబల్స్, టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. కానీ పళనిస్వామి వర్గం మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది. టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో నెగ్గింది. విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే, బలపరీక్షలో పాల్గొనలేదు. అయితే విశ్వాసపరీక్ష కన్నా ముందే కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు విజయ్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో 117 మ్యాజిక్ మార్క్.


