కాంగ్రెస్‌లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ కథనాలను కాంగ్రెస్ ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు వెల్లడించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, భాజపా మద్దతు ఉన్న అభ్యర్థిని అంగీకరించడం ప్రజాస్వామ్యం దుస్థితిని చాటుతోందన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు.

































