Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. త్వరలోనే

ఈపీఎఫ్‌వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్‌డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలోపు ఈపీఎఫ్‌ అమౌంట్‌ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ […]

ఈపీఎఫ్‌వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్‌డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలోపు ఈపీఎఫ్‌ అమౌంట్‌ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు.

ఈపీఎఫ్‌వో 3.0 కింద ఈ కొత్త విధానం అమలుకానుంది. ఈ సదుపాయం అమలులోకి వస్తే ఈపీఎఫ్‌ డబ్బును త్వరగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తై, అనుమతి లభిస్తే నగదును త్వరగా యూపీఐ ద్వారా లేదా ఈపీఎఫ్‌వో ఎనేబుల్డ్ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఈపీఎఫ్‌ అకౌంట్లలోని 75 శాతం డబ్బును ఇలా తమ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూపీఐ లేదా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ విధానాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. ఓటీపీ ద్వారా ఇలా నగదు ఈపీఎఫ్‌ అకౌంట్ల నుంచి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.