My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్‌లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో పాకిస్థాన్‌కు ఊహించని షాక్. బంగ్లాదేశ్ చేతిలో 104 పరుగుల […]

బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్‌లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో పాకిస్థాన్‌కు ఊహించని షాక్. బంగ్లాదేశ్ చేతిలో 104 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాక్ ర్యాంకింగ్స్‌ను దెబ్బతీసింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోల్పోయింది. నిర్ణీత సమయానికి ఎనిమిది ఓవర్లు వెనుకంజలో ఉండడంతో జరిమానా కింద డబ్ల్యూటీసీలో 8 పాయింట్ల కోత పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ రెండులో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌ వరసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.