కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరు లోని లోక్ భవన్‌లో ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్ మరియు శరణ్ ప్రకాష్ పాటిల్ ఉన్నారు.
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు.


