పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. మానేక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒవకేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించి, వాళ్లను ఇండియా మీదకు ఉసి గొల్పుతే, అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశాన్ని వాళ్లే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చరిత్రలో ఆ దేశానికి స్థానం ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషించరాదన్నారు. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులు మళ్లీ వస్తే ఏం చేస్తారని ఆయన్ను ప్రశ్నించారు. జనరల్ ద్వివేది తన వ్యాఖ్యల్లో పాకిస్తాన్‌కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా నిలుస్తుందన్నారు. గత ఏడాది మే 7వ తేదీన పాక్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత పాక్ దాడులు చేసినా, ఇండియా వాటిని తిప్పికొట్టింది. సుమారు 88 గంటల పాటు రెండు దేశాలు యుద్ధం కొనసాగించాయి. మే 10వ తేదీ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.


