కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోవడంతో మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే మళ్లీ రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బీజేపీ పార్టీ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కురియన్ అందజేసిన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొన్నది. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు కూడా ఆయన మంత్రిగా చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన సూచన మేరకు రాష్ట్రపతి ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మంత్రి మండలిలో ఉన్న క్రైస్తవ వర్గానికి చెందిన ఏకైక మంత్రి జార్జ్ కురియన్ మాత్రమే. జూన్ 21వ తేదీన ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది.

































