తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా రాధన్ పండిట్ నియామకాన్ని టీవీకే కూటమిలోని పార్టీ నేతలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రాధన్ పండిట్ తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన ఆస్ట్రాలజర్. ఎంతోమంది ప్రముఖుల విజయాన్ని ముందే ఊహించారు. జయలలిత రాజకీయ భవితవ్యం గురించి గతంలో కచ్చితంగా చెప్పగలిగారు. తాజాగా, టీవీకే ప్రభుత్వాన్ని స్థాపించిన విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన గతంలోనే చెప్పారు. ఇదే సమయంలో ఆయన విజయ్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.


