భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ ఫోగాట్‌కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపి, వినేష్ ఫోగాట్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఢిల్లీలో ప్రారంభం కాబోయే ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ ఫోగాట్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వినేష్‌కు సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మేం ఈ విషయంలో జోక్యం చేసుకోలేం. మీరు వెళ్లి ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. ఈ దశలో వెనక్కి రావాలని వినేష్‌కు ఆదేశాలివ్వలేం. ఆమె గతంలో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే కోర్టు వినేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ఇంకేం చేయలేం అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.


